విశాఖ తీరానికి పది నాటికల్ మైళ్ల దూరంలో శనివారం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయినా సోమవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. మునిగిపోయిన బోటు జాడ కూడా తెలియలేదు. ఈ నెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు (ఐఎన్డీ-ఏపీ-ఎంఎ-వీఎస్-83) వేట ముగించుకొని తిరిగి తీరానికి వస్తుండగా శనివారం మధ్యాహ్నం సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి బోల్తావడి మునిగిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు అందులోనే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు (విజయనగరం జిల్లా
Continue Read
ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వంశపారం పర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే. హస్తకళా రంగాలు భారతదేశ మూలాలు. దేశ సంస్
Continue Read
వెంటనే విధుల్లోకి వచ్చేస్తానంటున్నారు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు సూచించా ప్రజాసేవలో పడి భుజాల గాయాలను నిర్లక్ష్యం చేశారు ప్రస్తుతం నిలకడగా జనసేనాని ఆరోగ్యం మూడు వారాలు ఫిజియోథెరపీ ఉంటుంది నూతనోత్సాహంతో తిరిగొస్తారు: సీఎం చంద్రబాబు
Continue Read
ఈ ఏడాది ఆగస్టు 14 తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముందు అనకాపల్లి వరకూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించనున్నట్టు సీఎం తెలియచేశారు. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. వర్షపు సీజన్ సహా వరద నీటి ప్రవాహాలకు అనుగుణంగా జూలైలో గ్రావిటీపై నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్లను అమర్చే పనుల్
Continue Read
రాష్ట్రంలో కావిడ్ కేసులు చెదురుమొదురుగా బయటపడ్డాయి జూన్ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 మంది కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. వీరిలో నలుగురు మృతి చెందారు. వీరికి అంతకుముందే తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తొలి కౌవిడ్ కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదైంది. జులై 1 నుంచి 16 వరకు మరో 11 కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు కౌవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారు
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని రాజధానిగా చూపిస్తూ 28 జిల్లాలతో కూడిన తాజా రాష్ట్ర మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పరిపాలనా మార్పులకు అనుగుణంగా ఈ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త మ్యాప్‌లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని 28 జిల్లాలను స్పష్టంగా చూపించారు. ఇందులో ఇటీవల ఏర్పాటైన మార్కాపురం, పల్నాడు, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పి. మన్యం వంటి జిల్లాలు కూడా చోటు
Continue Read
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని... ఈ విషయంలో గిరిజన ప్రజలు ఎటువంటి ఆందోళనకు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులుతో సచివాలయంలో సోమవారం సమీక్ష చేశారు. జీవో నెంబర్ 3 పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై గిరిజన ప్రజల ఆకాంక్షలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మ
Continue Read
చంద్రబాబుకు జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ తెలంగాణ-ఏపీ జల వివాదాల్లో జోక్యం చేసుకోండి సుప్రీం తుది తీర్పు వచ్చేదాకా ఆలమట్టి ఎత్తుపై నోటిఫికేషన్ వద్దు పాటిల్ను కోరిన సీఎం.. పోలవరం రెండోదశకు నిధులివ్వాలని వినతి ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి.. ఫిష్ మీల్ ఎగుమతులపై నియంత్రణ విశాఖ మెట్రోకు అనుమతులు ఇవ్వండి.. పీయూష్ గోయల్, ఖట్టర్కు విజ్ఞప్తి
Continue Read