ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ను అధిగమించి టీ20 పరుగుల రారాజుగా అవతరించాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్, వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు
Continue Read
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో తదుపరి క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష అందుకున్నారు. 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడలు.. కామన్వెల్త్ చరిత్రలో శతాబ్ది (100వ) క్రీడలు కావడం విశేషం.
Continue Read
గ్లాస్గో: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ లో టాప్-5 లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. అనుకున్నది సాధించింది. గతంతో పోలిస్తే భారత్కు పతకాలు లభించే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలను ఈసారి తొలగించినా టోర్నీలో ఆడించిన ఆటల్లోనే మన క్రీడాకారులు సత్తాచాటి పతకాల పట్టికలో దేశాన్ని నాలుగో స్థానంలో నిలిపారు. ముఖ్యంగా బాక్సర్లు అంచనాలకు మించి పసిడి పంచ్లు విసిరి గ్లాస్గోలో స్వర్ణ చరిత్ర లిఖించగా అథ్లెట్లూ మునుపెన్నడూ లేని రికార్డులను తిరగరాస్తూ పతకాల మోత మోగించారు. బాక్సర్లు, వెయిట్ లిఫ్
Continue Read
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తో గట్టి సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అతను, దేశవాళీ వన్డే మ్యాచ్లో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ టోర్నమెంట్లో అమృత్సర్ తరఫున ఆడిన అభిషేక్, కేవలం 91 బంతుల్లోనే 233 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఏకంగా 25 సిక్సర్లు, 15 ఫోర్లు ఉండటం విశేషం. అభిషేక్ ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మ్యాచ్ లో అతడికి బౌలింగ్ చేయా
Continue Read
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానె సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో ద్వారా వీడ్కోలు సందేశం ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు ఆడి 8000కు పైగా పరుగులు కుటుంబం, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతం
Continue Read
జింబాబ్వే పర్యటనను భారత జట్టు మన విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 49-4, 4-6) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో టీమిండియా సునాయాసంగా నెగ్గింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
Continue Read
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప్రవంచ నాలుగో ర్యాంకర్, చైనా స్టార్ చెన్ యుఫేయీ 16-21, 22-20, 21-18తో సింధుపై విజయం సాధించింది. గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో చివరి వరకు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచి మంచి జోష్లో ఉన్న సింధు తొలి గేమ్ను అద్భుతంగా కైవసం చేసుకుంది.
Continue Read
జింబాబ్వే పర్యటనలో యువకులతో కూడిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్స్విప్ చేసింది. ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (81) ఆకాశమే హద్దుగా చెలరేగగా, బౌలింగ్లో మయాంక్ యాదవ్ (3/29) తన పేస్ ప్రత్యర్థిని కట్టడి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్క
Continue Read