భారత్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిప్పన్ పెయింట్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్ జెర్సీపై నిప్పన్ లోగో మెరవనుంది. అభిమానులను ఉత్సాహపరిచేందుకు 'బ్లాబర్ షేర్' అనే సరికొత్త మాస్కట్ను కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమ్ స్టార్ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ఈ కొత్త జెర్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిప్పన్ పెయింట్ (ఇండియా) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ మల్హోత్రా మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ తో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. అపారమైన శక్తి, స్ఫూర్తి, గెలవాలనే పట్టుదల కలిగిన జట్టు ఇదన్నారు. 'నెవర్ గివ్ అప్' అనే తత్వం నిప్పన్ పెయింట్ మూల విలువలతో లోతుగా ముడిపడి ఉందన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన దేశ గమనాన్ని ప్రతిబింబించేలా 'మా నయా ఇండియాకే నయా రంగ్' దార్శనికతను ఈ పట్టుదలే ముందుకు నడిపిస్తోందన్నారు. దేశంలోని ప్రతి మూలలో ఉన్న క్రికెట్ అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఐపీఎల్ ఒక అద్భుతమైన వేదిక అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రెండు బ్రాండ్ల శక్తిని, రంగులను అభిమానుల చెంతకు చేర్చాలని నిశ్చయించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిప్పన్ పెయింట్ ఇండియా (డెకరేటివ్ కోటింగ్స్ బిజినెస్) ప్రెసిడెంట్ మార్క్ టైటస్ మాట్లాడుతూ భారతదేశంలోని యువ వినియోగదారులకు చేరువ కావడానికి ఐపీఎల్ అత్యంత శక్తివంతమైన వేదిక అన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఉన్న ఉత్సాహభరితమైన గుర్తింపు, అంకితభావం గల అభిమానులు, నిప్పన్ పెయింట్ వృద్ధికి సరైన భాగస్వాములుగా నిలుస్తారన్నారు. ఈ భాగస్వామ్యం కేవలం జెర్సీపై లోగో ప్రదర్శనకే పరిమితం కాదన్నారు. భారతీయ తదుపరి తరం వినియోగదారులతో శాశ్వతమైన సంబంధాలను ఏర్పరచుకోవడమే మా లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ నిప్పన్ పెయింట్‌ను పంజాబ్ కింగ్స్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు.