చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 2025 ఐపీఎల్ సమయంలో తాను మానసికంగా అలసిపోయానని లేదంటే లీగ్ లో మరికొంత కాలం ఆడి ఉండేవాడినని అశ్విన్ పేర్కొన్నాడు. తాజాగా చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌ను తన యూట్యూబ్ ఛానెల్లో మాజీ క్రికెటర్ విమల్ కుమార్ అశ్విన్ విశ్లేషించాడు. ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఈ మ్యాచ్ (ఆర్సీబీ- సీఎస్కే)ను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ది వ్యూలోనే చూశాను. కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. గత సీజన్ చెన్నైకి కలిసిరాలేదు. అది వ్యక్తిగతంగా నాకు కూడా తీవ్రంగా నిరాశ కలిగించింది. ఆ సమయంలో నేను ఇంకా మరిన్ని సీజన్లు ఆడగలను అనిపించింది. కానీ, నేను ఎమోషనల్‌గా అలసిపోయాను. అందుకే ఇకపై ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాను' అని అన్నాడు. ఒకవేళ గత సీజన్ సీఎస్కేకు బాగా జరిగి ఉంటే ఈ సీజన్లో బరిలోకి దిగేవాడివా అని విమల్ అడిగాడు. దీనికి అశ్విన్, 'నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. అది మానసికంగా కలవరపెడుతుంది. నా పరంగా ఆ సీజన్ నన్ను బాగా నిరాశ పర్చింది. అందుకే ఇక ఆడకూడదు అనుకున్నా. దీనిపై నేను చర్చించుకున్నాను. అయితే నా ఐపీఎల్ కెరీర్ చెన్నైతోనే మొదలైంది. ఈ కెరీర్'ను నా సొంత సిటీలో చెన్నైతోనే ముగించాలనుకున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా' ‘అలాగే నేను రిటైర్ అయిపోతే ఫ్రాంచైజీకి కూడా నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నన్ను జట్టులో రిటైన్ చేసుకోవాలా? లేదా వదిలేయాలా అనే కన్ఫ్యూజన్ ఉండదు. నేను రిటైరైతే సీఎస్కేకు రూ.10 కోట్లు మిగులుతాయి. ఆ డబ్బుతో వేలంలో మరికొంతమంది ప్లేయర్లను కొనుగోలు చేసి జట్టును బలంగా చేసుకోవచ్చని ఆలోచించాను' అని అశ్విన్ తన రిటైర్మెంట్ వెనకున్న కారణాన్ని వెల్లడించాడు. కాగా, అశ్విన్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత 2025 ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడాడు. 2025 మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై రూ.9.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఆ సీజన్లో అశ్విన్‌కు తక్కువ అవకాశాలు లభించాయి. మొత్తం 14 మ్యాచ్‌లో అశ్విన్ 9 మ్యాచ్‌లోనే బరిలోకి దిగాడు. ఏడు వికెట్లు తీశాడు. ఇక అదే ఏడాది ఆగస్టులో ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఇక అశ్విన్ 2009లో చెన్నై తరఫునే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. కెరీర్ మొత్తంలోచెన్నై, పుణె, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 17ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో అశ్విన్ మొత్తం 239 మ్యాచ్‌లో 201 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుత సీజన్? లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్? లు ఆడగా మూడింట్లోనూ సీఎస్కే ఓడిపోయింది. తొలుత రాజస్థాన్' తో మ్యాచ్? లో ఓటమి చెందగా, తర్వాత వరుసగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లపై పరాజయం చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో సీఎస్కే 10వ స్థానానికి పడిపోయింది. ఇక ఏప్రిల్ 11 (శనివారం) చెన్నై నాలుగో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై దిల్లీ క్యాపిటల్స్'తో సీఎస్కే ఆడనుంది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.