logo
విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం
ట్రెండింగ్

విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం

డిజిటల్ మీడియా యుగంలో నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి పాజిటివ్ ఫలితాలను ఇస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని. అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన పోలీస్ కేసు, నైతికంగా ఆమెను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చేసినప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఊహించని రీతిలో కలిసొచ్చింది. ఈ వివాదం కారణంగా ఆమె నెలవారీ ఆదాయం ఏకంగా రూ.11 లక్షలకు పైగా పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

Continue Read
సుడిగాలి సుధీర్ తో దీపిక పిల్లి రిలేషన్...అసలు నిజం బయటపెట్టిన బ్యూటీ!
ట్రెండింగ్

సుడిగాలి సుధీర్ తో దీపిక పిల్లి రిలేషన్...అసలు నిజం బయటపెట్టిన బ్యూటీ!

జంటగా వెండితెర అయినా బుల్లితెర అయినా ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించారంటే చాలు వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే ఆలోచన లేకుండా.. ఎఫైర్ రూమర్స్ అంటగడుతూ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆకతాయిలు అంతటితో ఆగకుండా ఏకంగా వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి మరీ ఫలానా వ్యక్తులతో రిలేషన్ లో ఉన్నట్టు చెబుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.

Continue Read
'డ్రాగన్' కోసం కండలు పెంచుతున్న తారక్
ట్రెండింగ్

'డ్రాగన్' కోసం కండలు పెంచుతున్న తారక్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న భారీ యాక్షన్ చిత్రం కోసం ఆయన కఠోరంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. కెమెరాకు వీపు చూపిస్తూ, కండలు తిరిగిన తన శరీరాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continue Read
మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం
ట్రెండింగ్

మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం

నటుడు శివాజీ, యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య కొద్దిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించిన వస్త్రధారణ వివాదం మళ్లీ రాజుకుంది. అనసూయ తాజాగా చీరకట్టులో కనిపించడంపై ఓ మీడియా సంస్థ పెట్టిన క్యాప్షన్కు ఆమె ఇచ్చిన ఘాటు సమాధానం ఈ వివాదాన్ని మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మార్చింది. తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ అనసూయ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల అనసూయ తన భర్తతో కలిసి సాంప్రదాయబద్ధంగా పట్టుచీరలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వంచుకున్నారు. ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ తమ సోషల్ మీడియా ఖాతాలో

Continue Read
ఆశాభోంస్లే ఇకలేరు
ట్రెండింగ్

ఆశాభోంస్లే ఇకలేరు

భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Continue Read
బాలయ్య మూవీలో డింపుల్? మలినేని స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్

బాలయ్య మూవీలో డింపుల్? మలినేని స్ట్రాంగ్ కౌంటర్

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో, రెండో ప్రాజెక్ట్ (చీదీఖ 111) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సినిమా హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా డింపుల్ హయాతిని హీరోయిన్ గా తీసుకుంటున్నారనే వార్తలు కొన్ని

Continue Read
కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్...పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన
ట్రెండింగ్

కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్...పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కొత్త చిత్రాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన బృందం 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ గారు ఏ కొత్త సినిమా కమిట్మెంట్లు తీసుకోలేదు.

Continue Read
చెప్పిందొకటి, చూపించింది మరోటి!
ట్రెండింగ్

చెప్పిందొకటి, చూపించింది మరోటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందనే విషయం తెలిసిందే. కలెక్షన్స్, రికార్డుల పరంగా ఈ సినిమా కొత్త బెంచ్మార్న్లను సెట్ చేసినప్పటికీ, ఆ సినిమాలో నటించిన ఒక నటి అనుభవం మాత్రం మరో కోణాన్ని బయట పెడుతోంది. గ్లామర్, గ్రాండ్నెస్ వెనుక దాగి ఉన్న ఎడిటింగ్ రియాలిటీ పై ఈ సంఘటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చర్చలోకి వచ్చిన పేరు దివి.

Continue Read