రామ్ చరణ్ -- ఉపాసనలకు కవల పిల్లలు! మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు పుట్టినట్టు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లి ఉ పాసనతో పాటు ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉ న్నారని చిరంజీవి తెలిపారు. తమ కుటుంబంపై అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వార్త బయటకు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమాన లోకంలో ఆనందం వెల్లువెత్తింది. కొణిదెల కుటుంబానికి ఇది నిజంగా ఉపాసన డబుల్ బ్లెస్సింగ్గా మారింది. రామ్ చరణ్ దంపతుల కొత్త జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.