కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లి అంశాల్లో వరుసగా వార్తల్లో ఉంటున్నారు. నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె తన మాజీ ప్రేమికుడి గురించి చెప్పి మరోసారి నెట్టింట వైరల్గా మారారు. అతడితో బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధ పడలేదని తెలిపారు. ఆమె నటించిన తాజా చిత్రం 'దో దీవానే శహర్ మే' ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడి గురించి ప్రస్తావించారు. నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని బ్రేకప్ చెప్పాడు. నేను యాక్టింగ్ చేయడం కూడా తనకు నచ్చలేదు. విడిపోవడానికి అది కూడా ఓ కారణం. బ్రేకప్ చెప్పినందుకు నేనేం బాధపడలేదు. తన మనస్తత్వం గురించి జాలి పడ్డాను. అలాంటి వాళ్లతో కొనసాగడం కూడా కష్టమే. అందుకే విడిపోయాం. అలాంటివాళ్లతో ఉంటే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదని మృణాల్ తెలిపారు. కొన్ని నెలలుగా మృణాల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నటుడు ధనుష్ తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడంటూ ఆ ప్రచారాన్ని మృణాల్ ఖండించారు. తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందిస్తూ.. 'ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఫ్రీ పీఆర్ స్టంట్స్ ఇవి' అంటూ వాటికి చెక్ పెట్టారు.