టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు. తన మెడికల్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన శ్రీ లీల తాజాగా కాన్వోకేషన్ వేడుకలో మెడిసిన్ పట్టాను అందుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు వైరల్గా మారాయి. నిజానికి శ్రీవీల తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారిని స్ఫూర్తిగా తీసుకుని మెడిసిన్ వైపు అడుగులు వేశారు. గత ఏడాది చేతినిండా సినిమాలతో అత్యంత బిజీగా ఉ న్నప్పటికీ, తన లక్ష్యం కోసం చదువుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కోసారి రోజంతా షూటింగ్లతో బిజీగా ఉంటూనే, విరామ సమయంలో పుస్తకాలు చదువుతూ ఆమె పడ్డ శ్రమ ఇప్పుడు ఫలించింది. చిన్నతనంలో తన అమ్మమ్మ అనారోగ్యం పాలైనప్పుడు ఒక వైద్యురాలిగా సేవ చేయాలన్న తన కోరికను ఆమె నేడు నెరవేర్చుకున్నారు.