అమరావతిని శ్మశానం.. ఎడారి అని అన్నారు
వృధా జలాలలు వాడుకుంటే తప్పేంటి?
నేను ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు
పోలవరం పూర్తయితే అభివృద్ధి పరుగులే
2026లో ఉత్తమ ఫలితాలకు ప్రణాళిక
పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీ
ఈ ఏడాదిలో ల్యాండ్ రికార్డుల పూర్తి ప్రక్షాళన
మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు స్పీడు పెంచాలి
ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి: రాజధాని అమరావతిని శ్మశానం, ఎడారి అని గతంలో హేళన చేశారని.. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని సిఎం చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. అధికారులతో సమీక్షలొ సిఎం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు అని.. అది పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదని చెప్పారు. నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడూ అడ్డు చెప్పలేదని సీఎం గుర్తుచేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరలోనే జాతికి అంకింతం చేస్తామన్నారు. విశాఖ స్టీల్స్టాప్లాంట్ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాపాడుకున్నామని వివరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని. ఆ ఎ+-లాంట్‌ను నిలబెట్టి తీరుతామన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని తెలిపారు. పెట్టుబడులకు డెస్టినేషన్‌గా రాష్ట్రం మారిందన్నారు. ఎస్ఐపీబీ ద్వారా రూ.8.74లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని.. వాటి ద్వారా కూడా పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు.