ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. 15 ఏళ్ల ప్రాయంలోని జస్పీత్ బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ను చీల్చి చెండాడిన ఈ యువ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న ఈ విలువైన వజ్రాన్ని ముంబై ఇండియన్స్ తన్నుకుపోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే చేసిన ఓ పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన రాత్రి జతిన్ పరాంజపే ఎక్స్ వేదిక గా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. "వైభవ్ సూర్యవంశీ ఈరోజు తన భవిష్యత్తు జట్టుతో తలపడుతున్నాడు" అని ఆయన పేర్కొన్నారు. దీని అర్థం వైభవ్ త్వరలోనే ముంబై ఇండియన్స్ లోకి వెళ్లబోతున్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. సాధారణంగా యువ ప్రతిభను గుర్తించి స్టార్స్ మార్చడంలో రాజస్థాన్ రాయల్స్ ముందున్నా. వారిని ఎక్కువ కాలం జట్టులో ఉంచుకోవడంలో విఫలమవు తోందనే విమర్శలు ఉన్నాయి. జోస్ బట్లర్, సంజూ శాంస న్ వంటి స్టార్లను వదులుకోవడమే ఇందుకు నిదర్శనం. వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ 2025 మెగా వేలంలో కేవలం రూ.1.10 కోట్లకు మాత్రమే దక్కించుకుంది. కానీ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఫామ్, టాలెంట్ చూస్తుంటే.. 2027 మెగా వేలంలో వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. రిషబ్ పంత్ రికార్డును చెరిపేస్తూ వైభవ్ సూర్యవంశీ కోసం ఏకంగా రూ.30 కోట్లు వెచ్చించడానికి కూడా ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీలు వెనుకాడవని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడింగ్ ద్వారా లేదా వచ్చే మెగా వేలంలో ముంబై అతడిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు నిండిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సీనియర్ టీమిండియాకు ఆడేందుకు అర్హత సాధించాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ.. విదేశీ గడ్డపై కూడా సెంచరీలు బాదాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ఈ కుర్రాడిపై కన్నేసిందియ వైభవ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అతిత్వరలోనే వైభవ్ టీమిండియా నీలి రంగు జెర్సీలో కనిపించడం ఖాయం. ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్, మరోవైపు ఐపీఎల్ కాంట్రాక్టులతో వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో అత్యంత సంవన్న క్రికెటర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.