ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాకా' అనే పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. విడుదలైన పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. గుండుతో, కళ్లకు కాటుక పెట్టుకుని, ఒంటిపై వింత ఆకృతులతో ఉన్న ఈ లుక్ చూస్తుంటే ఆయన ఏదో 'వేర్-బీస్ట్' (జంతువుగా మారే మనిషి) తరహా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'జవాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. ఆమె ఈ చిత్రంలో ఒక వీరనారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో, అత్యాధునిక ఎఈచీ హంగులతో రూపొందుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం సహా 7 భాషల్లో 2027 వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 'విజన్ బియాండ్ లిమిట్స్' హద్దులు లేని ఊహ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.