జీవితంలో సంతోషం కావాలి.. అది మన ఒక్కరికే కాదు అందరికీ ఉండాలి ఇలాంటి కొటేషన్స్ మనం చాలా వింటూ ఉంటాం.. సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టి సంబరపడిపోతాం.. తరువాత మర్చిపోతాం. కానీ.. బాధ్యతతో జీవించడం అంటే మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా నమ్మేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో కూడా చిన్న జీవితంలో సంతోషకరమైన సమాజాన్ని చూడటం కోసం మనం ఏదైనా చేయాలని పరిశ్రమించేవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇదిగో సరిగ్గా అలాంటి వ్యక్తే.. రమేష్ బాబు. బాధ్యతతో కూడిన పౌర సమాజం కోసం సిటిజన్ ఫోర్స్ సంస్థ స్థాపించి దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిదాయకమై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు రమేష్ బాబు. “అందరి కోసం ఒక్కరు.. ఒక్కరి కోసం అందరు” అనే నినాదంతో సిటిజన్ ఫోర్స్ ద్వారా జాతీయస్థాయిలో తన ఆలోచనలను ఆచరణలో చూపిస్తున్నారు రమేష్ బాబు. కనీస హక్కులైన విద్య, వైద్య రంగాల్లో సేవలందించడంతో పాటు, ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చి.. సిటిజన్ ఫోర్స్ లో సమాజ సేవకుల సైన్యాన్ని తయారు చేశారు రమేష్ బాబు. ఆయన ఒక్కరి ఆలోచన ఇప్పుడు వేలాది మంది గుండెల్లో నినాదంగా మారింది. ప్రతి వ్యక్తీ ఓ సేవియర్ అనే ఆయన లక్ష్యం లక్షలాది మందికి ధైర్యం అయింది. ఇప్పుడు దేశంలోని కోట్లాదిమంది క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చేలా క్యాన్సర్ హాస్పిటల్ కు రూపకల్పన చేస్తుండడమే కాకుండా దేశంలోనే ప్రప్రథమంగా క్యాన్సర్ బాధితుల కోసం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ప్రారంభించారు. బాధ్యతాయుతమైన సమాజం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తున్న చేస్తున్న రమేష్ బాబు పుట్టినరోజు.. ఆయన మానసపుత్రిక సిటిజన్ ఫోర్స్ అవతరణ ఉత్సవం ఒకటే రోజు కావడం గొప్ప విషయం. ఈ సముచితమైన సందర్భంలో సిటిజన్ ఫోర్స్ ను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు సిటిజన్ ఫోర్స్ మీడియాను ఆవిష్కరించడం సంతోషదాయకం. సిటిజన్ ఫోర్స్ ప్రతి అడుగు తన శ్వాసగా.. సాధించే ప్రతి విజయం తన జీవితానికి సార్థకతగా ముందుకు సాగుతున్న రమేష్ బాబు గారికి సిటిజెన్ ఫోర్స్ సైన్యం శుభాకాంక్షలందిస్తోంది.