హర్మూజ్ పై సుంకాలు విధింపును సమర్థించుకున్న ఇరాన్
గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.
వాషింగ్టన్ : గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా 'ది ట్రూత్' లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా, 'ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తాం' అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా కూడా హోర్ముజ్ విషయంలో ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఇప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే హోర్ముజ్ జలసంధి ఉ ంది. హోర్ముజ్‌లో షిప్పుల నుంచి ఇరాన్ భారీ మొత్తంలో టోల్ వసూలు చేస్తోంది. టోల్ ఫీజు ఆదాయాన్ని పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామని అంటోంది. పాకిస్థాన్ ప్రధాని సూచనల మేరకే గడువును పొడిగించినట్టు ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించడం వెనుక చైనా కీలక పాత్ర పోషించిందని వార్తలు వస్తున్నాయి. 'కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి టెహ్రాన్ న్ను ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా' అని విలేకరులు ప్రశ్నించినపుడు 'అవుననే అనుకుంటున్నా. నేను కూడా విన్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో చైనా పర్యటనకు ట్రంప్ వెళ్లబోతున్నారు. ఆ సమయం లోపునే ఈ యుద్ధం ముగిసిపోవాలని చైనా భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టు వంటి మధ్యవర్తుల ద్వారా ఇరానన్ను శాంతి మార్గం వైపు నడిపించడంలో చైనా నిశబ్దంగా పని చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో బీజింగ్ పాత్రపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. నిజానికి ఈ యుద్ధం ఆగడం చైనాకు కూడా చాలా కీలకం. ఎందుకంటే చైనాకు ఇరాన్ ప్రధాన ఆయిల్ సరఫరాదారు. హోర్ముజ్ జలసంధి మూసి వేసి ఉండడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చల విషయమై చైనా అధికారులు నేరుగా ఇరాన్ నాయకులతోనే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఏదేమైనా, భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో చైనా ప్రభావం మరింత పెరుగుతుందనేందుకు ఈ పరిణామం కీలక సంకేతం.