అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం
భూ యజమానులకు భరోసా
1.12 కోట్ల మందికి పట్టాదారులకు పాస్ పుస్తకాలు
ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం
రెవెన్యూ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: రాష్ట్రంలో భూ యజమానులకు, పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ శాఖపై జరిపిన సమీక్షలో సుమారు 75 లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా వలు నిర్ణయాలు తీసుకున్నారు. భూములు విముక్తి నుంచి రిజిస్ట్రేషన్ల సరళీకరణ వరకు సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రెవెన్యూ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూములు రీసర్వే పక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి, 1.12 కోట్ల మంది పట్టా దారులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను సెక్షన్ 22- ఎజాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇతర సర్వీస్ ఇనాంలలో ఉన్న మరో లక్ష ఎకరాల భూములకు కూడా విముక్తి కల్పించనున్నారు. ఈ పక్రియను చట్టబద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ఒక కొత్త చట్టాన్ని అధికారులను ఆదేశించారు. 2016 కంటే ముందు తీసుకురావాలని ప్రభుత్వ హౌసింగ్ స్కీం కింద వట్టాలు పొందిన పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించనున్నారు. దీని ద్వారా సదరు ఆస్తులకు అమ్ముకోవడానికి, వారసులకు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వడానికి లబ్దిదారులకు పూర్తి హక్కులు లభిస్తాయి. ఫ్రీ హోల్డ్ కింద అర్హత కలిగిన 9.25లక్షల ఎకరాల భూములపై ఆయా యజమానులకు త్వరలోనే పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. భూ రికార్డుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు, రికార్డులను ట్యాంపరింగ్ చేయడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు.