ఐపీఎల్ 2026 సీజన్ న్ను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా వం-ణుడు మ్యాచ్లకు ఆటంకం కలిగిస్తున్నాడు. సోమవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు.దీంతో మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి నేడు ఢిల్లీ వేదికగా జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పైనే పడింది. ఈ మ్యాచ్కు వాన దేవుడు ఆటంకం కలిగిస్తాడా..? ఢిల్లీలో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది అన్న దానిపైనే ఉంది. అక్యూవెదర్ ప్రకారం ఢిల్లీలో ఉదయం పూట వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుంది. అరు-తే.. మధ్యాహ్నం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 51 శాతం ఉందని అంచనా వేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఉంది. అయితే.. మ్యాచ్ జరిగే సమయం రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎలాంటి వర్షం పడదని తెలిపింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని తెలిపింది. అయిు-తే.. మధ్యాహ్నం పడిన వర్షం తరువాత మైదానాన్ని ఎంత త్వరగా సిద్ధం చేస్తారనే దానిపైనే పూర్తి మ్యాచ్ జరగనుందా..? ఓవర్లను కుదిస్తారా..? అన్నది ఆధారపడి ఉంది.