చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమకు తిరుగులేదని నిరూపించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఉ ఫ్ మనిపించింది. పవర్ ప్లేలోనే గుజరాత్ బౌలర్లకు దడ పుట్టించిన విరాట్ కోహ్లి(81), దేవత్ పడిక్కల్(55) అర్ధ శతకాలతో విజయానిక బాటలు వేయగా.. ఆఖర్లో రషీద్ ఖాన్(2-49) విజృంభణతో గుజరాత్ పోటీలోకి వచ్చింది. కానీ, కృనాల్ పాండ్యా(23 నాటౌట్) మెరువులతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు. ఐదో విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్ వంతొమ్మిదో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తాంది. చిన్నస్వామి స్టేడియంలో బౌలర్లు భారీ స్కోర్ సమర్పించుకున్నా. బ్యాటర్ల మెరుపులతో గుజరాత్ టైటాన్స్‌కు ఆర్సీబీ చెక్ పెట్టింది. విరాట్ కోహ్లి(81), దేవత్ పడిక్కల్ (55) శతక భాగస్వామ్యంతో బలమైన పునాది వేయగా.. కృనాల్ పాండ్యా లాంఛనం పూర్తి చేశాడు.
సుందర్ వదిలేయడంతో..
భారీ ఛేదనలో సిరాజ్ ఆదిలోనే ఆర్సీబీకి షాకిచ్చాడు. విరాట్ కోహ్లి ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుందర్ నేలపాలు చేశాడు. అయినా షారుక్ ఖాన్ క్యాచ్ 24 పరుగులకే ఆర్సీబీ తొలి వికెట్ పడింది. జాకబ్ బెథెల్ (14) సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెథెల్ వికెట్ పడినా దేవత్. పడిక్కల్, విరాట్ కోహ్లిలు.. దూకుడుగా ఆడి పవర్ ప్లేలో 50 స్కోర్ దాటించారు. ఇద్దరూ అర్థ శతకాలతో ఆర్సీబీ విజయానికి బాటలు వేశారు. వీరిద్దరి జోరు చూస్తే అజేయంగా గెలిపిస్తారనిపించింది. కానీ, రషీద్ ఖాన్ 13వ ఓవర్లో పదిక్కల్ ఔటవ్వగా.. హోలర్డ్ బౌలింగ్‌లో వరసగా రెండు సిక్సర్లతో బెంగళూరు స్కోర్ 150 దాటించిన కోహ్లి ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు.
రషీద్ తన తర్వాతి ఓవర్లో జితేశ్ శర్మ(10)ను ఔట్ చేయగా.. డేంజరస్ రజత్ పాటిదార్ (8)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. అంతే.. అప్పటిదాకా ఆర్సీబీ గెలుపు బాయమైన మ్యాచ్‌లో ఉత్కంఠ మొదలైంది. అయినా టిమ్ డేవిడ్ (10 నాటౌట్) క్రీజులో ఉండడంతో ఆర్సీబీ అభిమానులు నిశ్చింతగా ఉన్నారు. రబడ ఓవర్లో డేవిడ్ సిక్సర్ కొట్టగా.. మానవ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా(23 నాటౌట్) రెండు ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. 19వ ఓవర్లో పాండ్యా ఫోర్, సింగిల్ తీయగా ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఆర్సీబీ జయభేరి మోగించింది.
శతకంతో విరుచుకువడిన సుదర్శన్
టాస్ ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి. (100), శుభ్‌మన్ గిల్(32) అదిరే ఆరంభమిచ్చారు. చిన్నస్వామిలో ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్నొన్న సాయి ఈ సీజన్లో రెండో అర్థ శతకంతో మెరిశాడు. మరో ఎండ్‌లో గిల్ సైతం దంచేయగా.. 10 ఓవర్లకే గుజరాత్ స్కోర్ వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు ప్రయత్నించి సఫలమయ్యాడు. 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే సెంచరీ హీరోను హేజిల్ వుడ్ వెనక్కి పంపిగా గుజరాత్ స్కోర్ వేగానికి బ్రేకులు పడ్డాయి. ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్(25) దంచేస్తాడనుకుంటే అతడిని భువనేశ్వర్ ఔట్ చేసి గుజరాత్‌కు షాకిచ్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(19 నాటౌట్), జేసన్ హోల్టర్(23 నాటౌట్)లు చెలరేగారు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హోల్డర్ 6, 6, 4తో గుజరాత్ స్కోర్ రెండొండలు దాటించాడు. సుదర్శన్ సెంచరీ, హోల్డర్ మెరుపులతో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.