'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, కుర్రకారు మనసు గెలుచుకున్న భామ కేతికా శర్మ. సినిమాల్లో హిట్లు పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం ఈమె రేంజ్ వేరే లెవల్లో ఉ ంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. "లిటిల్ మార్లిన్... లిటిల్ మిస్టరీ" అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టైలిష్ డ్రెన్లో కేతిక ఒలకబోస్తున్న గ్లామర్ చూసి నెటిజన్లు 'గార్జియన్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కేతికా శర్మ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా, యూత్ ఆమెకున్న ఫాలోయింగ్ మాత్రం భారీగా ఉంటుంది.
'రొమాంటిక్' సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ఈ బ్యూటీ, ఆ తర్వాత 'సింగిల్' వంటి చిత్రాల్లో యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేతికకు సినిమాలు కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అభిమానుల కోసం ఆమె ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ టచ్‌లో ఉ ంటుంది. తాజాగా కేతికా శర్మ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఆమె ఈ ఫోటో షూట్ కోసం 'జరా ఫ్లోరల్ డీటెయిల్ స్ట్రెచ్ మిడీ డ్రెన్'ను ఎంచుకుంది. స్క్వేర్ నెక్ లైన్ మరియు వైడ్ స్ట్రాప్స్ కూడిన ఈ స్లిమ్ ఫిట్ డ్రెన్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. డ్రెస్‌పై ఉ న్న ఫ్లోరల్ డిజైన్ ఆమెకు ఒక క్లాసీ లుక్‌ను ఇచ్చింది. ఈ స్టైలిష్ అవతార్ లో కేతికను చూస్తుంటే నిజంగానే ఏదో మిస్టరీ దాగున్నట్లు అనిపిస్తోందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.