మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'కి సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా? చివరకు ఈ అవకాశాన్ని శృతి హాసన్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమై, తక్కువ సమయంలో పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు హైలైట్‌గా నిలిచే ఈ పాటలో శృతి హాసన్ గ్లామర్, స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శృతి హాసన్‌కు స్పెషల్ సాంగ్స్ కొత్తేమీ కాదు. గతంలోనే రామ్ చరణ్ కలిసి 'ఎవడు' సినిమాలో 'పింపుల్ డింపుల్' పాటలో సందడి చేసిన విషయం తెలిసిందే. అలాగే మహేశ్ బాబు నటించిన 'ఆగడు' సినిమాలో కూడా ఆమె ప్రత్యేక గీతంలో మెరిసి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు 'పెద్ది'లో మరోసారి స్పెషల్ సాంగ్‌తో రాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా? శృతి హాసన్ ఎంట్రీతో మరింత హైప్ పెరిగే అవకాశముంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'పెద్ది' సినిమా మంచి త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ పాట ఎలా ఉ ండబోతుందో? శృతి హాసన్ ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది కావడంతో ఈ ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తెలుగులో చేస్తున్న కీలక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.