మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు భారీగా ఉ న్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి రిలీజ్ డేట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట జూన్ 4న సినిమా వస్తుందని ప్రచారం జరిగినా, లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ మరో డేట్‌ను ఖరారు చేశారు. కేవలం సెంటిమెంట్ కోసం కాకుండా, వక్కా బిజినెన్ లెక్కలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరంగా మారాయి. అసలు విషయం ఏంటంటే, 'పెద్ది' సినిమాను జూన్ 25న విడుదల చేయడానికి చిత్ర బృందం మొగ్గు చూపుతోంది. జూన్ మొదటి వారంలో స్కూళ్లు రీఓపెన్ అయ్యే హడావిడి ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమని భావించి జూన్ 4 ఆప్షన్ ను పక్కన పెట్టారు. అదే 25వ తేదీ అయితే నెలాఖరు కావడంతో పాటు శాలరీలు పడే టైమ్, దీనివల్ల ఓపెనింగ్సు ప్లన్ అవుతుంది. అంతేకాకుండా యూఎన్ మార్కెట్లో జూలై వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది. ఓవర్సీస్ వసూళ్లపై కన్నేసిన చరణ్ టీమ్, ఈ లాంగ్ రన్ స్ట్రాటజీతోనే జూన్ 25ను లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తవ్వగా, మే మొదటి వారంలో శ్రుతి హాసన్‌తో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ చేయ-బోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.