కృతిససన్ టాలీవుడ్, బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో భాగమైన అమ్మడి కెరీర్ అవి పెద్దగా ఉపయోగ పడలేదు. ఆ రెండు భారీ కాన్వాస్ పై తెరకెక్కిన సినిమాలే అయినా ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అలాగని అమ్మడు టాలీవుడ్ కు దూరంగా కాలేదు. ఇక్కడ పరిశ్రమకు టచ్ లో ఉంటూనే బాలీవుడ్ లో కూడా దిగ్విజయంగా కెరీర్ ను కొనసాగిస్తోంది. అనతి కాలంలోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుని ఉత్తరాదిన తన ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ బిజీ నాయికల్లో తాను కూడా ఒకరు. అదనంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటడం అమ్మడి ప్రత్యేకత. ఇలా కమర్శియల్ సినిమాలతో పాటు లీడ్ రోల్స్ పోషిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త జర్నీ కూడా మొదలు పెట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నన-హై జవానీ తో ఇష్క్ హోనా హై- అనే చిత్రంలో అమ్మడు ఐటం భామగా మెప్పించడానికి రెడీ అయింది. ఇందులో మృణాల్ ఠాకూర్, పూజాహెగ్దే హీరోయిన్లుగా నటిస్తుండగా, ఐటం భామగా మాత్రం కృతి సనన్ ని ఎంపిక చేసారు.
ఈ పాటతో కృతి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ఈ పాట షూటింగ్ కోసం చిత్ర బృందం ఓ భారీ సెట్ నిర్మించింది. కృతి లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె పోషించిన పాత్రల కంటే ఇది భిన్నంగా, అత్యంత గ్లామరస్ గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. అమ్మడి అభిమానులకు ఇదో పెద్ద సర్సైజ్ అని చెప్పొచ్చు. ఈ స్పెషల్ సాంగ్ గురించి కృతి సనన్ గానీ, సినిమా టీమ్ గానీ ఎక్కడా అధికారికంగా పెదవి విప్పలేదు. అంతా చాలా గోప్యంగా ఉ ంచుతున్నారు.