ఎంజీఆర్, ఎన్టీఆర్ మంచి మిత్రులు మహిళలకు కాంగ్రెస్, డీఎంకే ద్రోహం మీ వల్ల భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుంది స్టాలిన్‌కు చంద్రబాబు కౌంటర్ ఒకప్పుడు తమిళనాడు ఆర్థికంగా బలోపేతం ఇప్పటి పరిస్థితి ఏంటో ఆలోచించాలి తమిళనాడులో ఎన్డీయే అభ్యర్థులకు బాబు ప్రచారం
ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకున్న రాజకీయ అనుభవంలో ఎంతోమంది నాయకులను చూశానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం అరుదైన వ్యక్తి అని ప్రశంసించారు. దేశ గౌరవాన్ని మోదీ నిలబెట్టారని కొనియాడారు. మహిళలకు మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. సోమవారం తమిళనాడులోని ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. థల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నగేష్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం తమిళంలో ప్రసంగాన్ని ప్రారంభించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు. తన పుట్టినరోజున ఇక్కడకు వచ్చానని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. పుట్టిన రోజున ఇక్కడికి వచ్చానంటే ప్రాధాన్యం అర్థం చేసుకోవాలని అన్నారు. తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులను ప్రజలు గెలిపించాలని కోరారు. తమిళభా షకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఉద్ఘాటించారు. మనంద రికీ మదరాసు రాజధానిగా పరిపాలన కొనసాగిందని తెలిపారు. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, శ్రమ కలిగిన వారు.. వారి విజయానికి అదే సూత్రమని చెప్పారు. ఎంతోమంది ప్రముఖులు, చరిత్రకారులు తమిళనాడు వారు ఉన్నారని ప్రస్తావించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ద్రావిడ భాషలను ప్రోత్సహించారని చెప్పుకొ చ్చారు. ద్రవిడ యూనివర్సిటీని ప్రారంభించారని ప్రస్తావించారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ కూడా తమిళనాడులోనే జీవించారని.. తనకు పెళ్లి జరి గింది కూడా తమిళనాడులోనేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లు చాలా దగ్గరి స్నేహితుల ని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీయే భాగస్వా మ్య పక్షాల తరఫున ప్రచారం నిర్వహించారు. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుంది. భవిష్య త్తులో అన్నీ కుదిరితే గోదావరి- కృష్ణ- కావేరి నదులు అనుసంధానం కావాలి. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలు మనకొద్దు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది.. ఎన్డీయే మాత్రమే అని చంద్రబాబు అన్నారు.