ప్రముఖ నటుడు చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆర్థిక సాయంతో ఆదుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీకి రూ.9.5 లక్షలు అందజేశారు. సాయం చేయడమే కాదు శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా వర్యవేక్షించి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు.