డిజిటల్ మీడియా యుగంలో నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి పాజిటివ్ ఫలితాలను ఇస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని. అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన పోలీస్ కేసు, నైతికంగా ఆమెను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చేసినప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఊహించని రీతిలో కలిసొచ్చింది. ఈ వివాదం కారణంగా ఆమె నెలవారీ ఆదాయం ఏకంగా రూ.11 లక్షలకు పైగా పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేకమైన వీడియోల కోసం నెలకు రూ.399 చొప్పున సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆమెపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందకముందు, ఆమెకు 1,892 మంది సబ్స్క్ర్కైబర్లు ఉండేవారు. దీని ద్వారా ఆమెకు నెలకు సుమారు రూ.7.18 లక్షల ఆదాయం వచ్చేది. అయితే, ఎప్పుడైతే ఆమెపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) నేతలు ఫిర్యాదు చేశారో, ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ఆమె అప్లోడ్ చేసే కంటెంట్‌లో ఏముందో చూడాలనే ఆసక్తి నెటిజన్లలో ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా, కొద్ది రోజుల్లోనే ఆమె సబ్ స్కైబర్ల సంఖ్య 4,832కు చేరింది. తద్వారా ఆమె నెలవారీ ఆదాయం ఇప్పుడు రూ.18.36 లక్షలకు పైగా చేరింది. అంటే, కేవలం ఈ వివాదం వల్ల ఆమె సంపాదనలో రూ.11 లక్షలకు పైగా పెరుగుదల కనిపించింది.