ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి పేజీలలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా తమ అందాలతో అభిమానులను కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి ట్రెండ్ ఫాలో అవ్వడానికి సిద్ధమయ్యిందో లేదో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుందో తెలియదు కానీ ప్రముఖ అందాల తార రుక్మిణి వసంత్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ఏమాత్రం గ్లామర్ కు చోటు ఇవ్వకుండా సింపుల్గా, ట్రెడిషనల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సడన్గా గ్లామర్ డోస్ పెంచేసి తాజాగా షేర్ చేసిన ఫోటోలు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అభిమానులకు చెమటలు పడుతున్నాయి. తాజాగా గోల్డెన్ కలర్ ఆర్గాంజా శారీ కట్టుకున్న ఈమె వితౌట్ బ్లౌజ్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నాటి తరం గ్రామీణ గెటప్ లో కనిపించి హెయలు పోయింది. ప్రత్యేకించి జుట్టును లీవ్ చేసి చేతులకు పలు రకాల రింగ్స్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రుక్మిణి వసంత్. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫోటోషూట్ షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్స్ రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్ పై తెగ కామెంట్లు చేస్తున్నారు. సమ్మర్ వేళ ఇలాంటి హాట్ డోస్ పెంచి మరింత హీటెక్కిస్తోంది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది నీ అందానికి తట్టుకోలేకపోతున్నాం అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.