రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్
2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్
నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
త్వరలో రాయలసీమలో మరో భారీ ప్లాంట్
ఆంధప్రదేశ్ లోని రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్డ్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్ కు భూమి పూజ గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మొత్తంగా రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ.. సుమారు రూ.4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్? వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో రూ.1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి. రెస్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్? వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏపీని రెన్యువబుల్ ఎనర్జీకి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్‌కు హాజరైన రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశలవారీగా రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించనుండగా త్వరలోనే సుమారుగా రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ షక్రియ చేపట్టనుంది. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 2015లో కళ్యాణదుర్గం లో విండ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోకి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అడుగుపెట్టింది. 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామ-ర్థ్యంతో ఏపీలోని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ఎ+-లాంట్‌లు ఇప్పటికే పని చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్‌కు వంటి ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, టీసీఎస్ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ నెలలో అతి పెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్ సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు. సాఫ్ట్ వేర్, ఎనర్జీ, స్టీల్, మెడ్ టెక్, ఫార్మా వంటి రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది. మరోవైపు వర్యాటకంగా? ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోంది. ఉదయం 09.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి జెడ్. చింతువకు బయలుదేరి వెళతారు. 11.10 గంటలకు రెన్యూ గ్లోబల్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపనలో కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 02.35 గంటలకు అమరావతి చేరుకుంటారు.
పిఠాపురం ఘటనపై చంద్రబాబు సీరియస్
పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సీఎం మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నేతలు ప్రొటోకాల్ పేరుతో, ప్లెక్సీల్లో ఫొటోల ప్రాధాన్యం కోసం ఘర్షణ పడటం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడా సమావేశం సందర్భంగా జరిగిన ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరు సరికాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా గొడవలు పడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇలాంటి ఘటనలు కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హుకుం జారీ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన సూచనలు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణను కాపాడాలని, నేతలు వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ వడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. వ్యక్తిగత మర్షణలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని సీఎం హెచ్చరించారు.