విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ కాంబోలో రానున్న సినిమా టైటిల్ ఖరారయ్యింది, ఇప్పటివరకూ 'పూరి సేతుపతి'గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే పేరు ఖరారు చేశారు. '33 టెంపుల్ రోడ్' అనేది ఉపశీర్షిక, టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి ఆసక్తికర లుక్‌లో కనిపించారు. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా ఉన్నారు. ఈ పోస్టర్‌ను పంచుకున్న టీమ్ ఆసక్తికర క్యాప్షన్‌ను షేర్ చేసింది. 'మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది' అనే క్యాప్షన్ ఇందులో విజయ్ పాత్ర తీరును తెలిపేలా ఉంది. ఎన్నో రోజులుగా ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ 'స్లమ్ డాగ్'ను అధికారికంగా ప్రకటించారు. గతేడాది జులై మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఐదు నెలల్లోనే కంప్లీట్ చేసేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. సంయుక్త కథానాయికగా నటించారు. టబు (పేజీశిబి), విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం ముస్తాబైంది. విజయ్ సేతుపతి ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.