నటి నిధి అగర్వాల్ సంలచన కామెంట్స్
తన సినిమాల విడుదల సమయాల్లోనే కాకుండా తరచూ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను వంచుకుంటూ ఉంటారు నటి నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ పాడ్కాస్ట్లో పాల్గొని పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానం. ఆయనంటే అంత క్రేజ్ ఉంది. అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సొంతం. ఆయన కూడా అభిమానులను అలానే చూసుకుంటారు. ఆయనతో కలిసి వర్క్ చేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. కలిసిన అందరితో బాగా మాట్లాడతారు. 'హరిహర వీరమల్లు'కు వర్క్ చేసే సమయంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి 'మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు' అని అనేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ పాజిటివ్ ఉంటారు. వందశాతం కష్టవడతారు. ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా చెబుతారు. నిజాయతీగా ఉంటారు. సినిమాలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన్ని ఇష్టపడతారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపడను' అని నిధి అన్నారు.ఒకరిని ఉ న్నతస్థానాలకు తీసుకెళ్లడానికి కాకుండా.. తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నటీనటులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. నెగెటివ్ ప్రచారం వల్ల మానసికంగా కుంగిపోతారు. వాళ్లతో పాటు వాళ్ల కుటుంబాలు కూడా ఎంతో బాధను అనుభవిస్తాయని నిధి ఆవేదన వ్యక్తం చేశారు.