రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
పీపీపీ మోడల్ లో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ
టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణ గ్యారెంటీ
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం
డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ
అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు
అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్
అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం సందర్భంగా 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ వద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు.. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదిక పై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ నేతల దుష్పచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ సిట్ చార్జ్ షీట్ వేసిన విషయాన్ని అధికారులు కేబినెట్‌కు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తితిదే లడ్డూ తయారీలో ఉ పయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత.. దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రధానంగా పిడుగురాళ్ల వైద్యకళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చించారు. పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం ఇచ్చింది. అమరావతి పరిధిలోని వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం ఇచ్చారు. అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుకు ఆమోదం ఇచ్చింది. తితిదే వరిధిలో పలు పోస్టుల అప్గ్రేడు, పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం ఇచ్చింది. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదం లభించింది. వలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం ఇచ్చారు. ఇంధనశాఖలో పలు వరిపాలన అనుమతులకు ఆమోదం ఇచచ్చింది. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం గార్డెన్‌సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు జారీ చేసిన అనుమతులను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని మంత్రివర్ణ నిర్ణయం పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం ఇచ్చింది. ఇకపోతే నెయ్యి కల్తీపై వైసీపీ చేస్తున్న దుష్పచారంపై కేబినెట్ మీటింగ్ లో మంత్రులు పలు విషయాలను సీఎంకు వివరించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన బ్యాంకు అకౌంట్ లో రూ.4.50 కోట్లు జమ అయ్యాయని మంత్రులు అన్నారు. అధికారులు కూడా సీఎంకు పలు విషయాలను వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది యదార్ధమని అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ తీసుకున్న డెయిరీకి పాల సేకరణ సామర్థ్యం లేదని అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో కల్తీ నెయ్యికి సంబంధించి మంత్రులు మరికొన్ని విషయాలను సీఎం వద్ద ప్రస్తావించారు. కాంట్రాక్ట్ తీసుకున్న డెయిరీలు కొన్ని రసాయనాలు మిశ్రమం ఉపయోగించి నెయ్యి తయారు చేశారని మంత్రులు వెల్లడించారు. వైసీపీ హయాంలో తప్పు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారని మంత్రులు అన్నారు. సిట్ నివేదిక వచ్చిన తరు వాత మాట్లాడుదామని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ నేరప్రవృత్తి అలానే ఉంటుందని, కోడి కత్తి, బాబాయి గొడ్డలి, గులక రాయి కేసులు ఎలా చేశారో మీరు చూశారు కదా? అని సీఎం అన్నారు.