ఈ ఏడాది చివరికి 10 లక్షల పైగా గృహ ప్రవేశాలు
నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఉచితం
రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాభివృద్ధికి ఐదు సూత్రాల అమలు
లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన
గత ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం నష్టం
ఏలూరులో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీ ఏర్పాటు
వ్యవసాయ బడ్జెట్‌పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖల పద్దులపై జరిగిన చర్చలో సీఎం ప్రపంగించారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ఇళ్లకు గృహ ప్రవేశాలు జరిపిస్తామని ఆయన సభలో ప్రకటించారు. ఇప్పటికీ ఇళ్లు లేని విరుపేదలు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని సీఎం తెలిపారు. రాయచోటి నుంచి ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఉగాది నాటికి దాదాపు 3 లక్షల ఇళ్లలో లబ్దిదారులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ నాటికి మరో 2.26 లక్షలు, సెప్టెంబర్ నాటికి ఇంకో 2.10 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రణాళికను వివరించారు. 2029 నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించడంతో పాటు, అర్హులైన వారికి ఉచితంగా ఇంటి స్థలాలు కూడా పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.20 లక్షల కుటుంబాలకు సొంత జాగా లేదని గుర్తించామన్నారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం
గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగం, ఇసుక విధానాల్లో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల ఇళ్ల పేరుతో గత పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాయని తెలిపారు.
అగ్రిటెక్ ద్వారా వ్యవసాయాభివృద్ది
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవర ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పదిశాతం వాటా ఉందని ప్రస్తావించారు. శుక్రవారం వ్యవసాయ రంగం బడ్జెట్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచసూత్రాలు, అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యాన పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో ఉద్యానపంటల దిగుబడుల్ని నాలుగు వందల మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృత్రిమమేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా.. చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మందిని మళ్లించాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం ఉద్యాన పంటల కేంద్రంగా రాయలసీమ ఉంది. రాయలసీమలోని 20 లక్షల హెక్టార్ల ఉద్యానపంటల్ని 40లక్షల హెక్టార్లకు పెంచుతాం. దిగుబడులను వెయ్యి మిలియన్ టన్నులకు పెంచుతాం. రూ.30 వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తాం. మౌలిక వసతులకు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తాం. భూగర్భ జలాలు పెంచి నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలి. రైతులు కూడా ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి. అందరికీ ఇళ్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. ధాన్యం కొనుగోళ్లకు రూ.10వేల కోట్లకు పైగా అన్నదాతలకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. రూ.1,670 కోట్ల ధాన్యం బకాయిలు తాము చెల్లించామని స్పష్టం చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నదాతల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నా మని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కృత్తిమ మేథ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారు. కృత్తిమ మేథ అందించే వ్యవసాయ శాస్త్రవేత్తలను రైతుల కోసం నియమిస్తామని తెలిపారు. 8వేలకు పైగా గ్రామాల్లో 15 లక్షల మంది రైతన్నలు ప్రకృతి సేద్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 40 లక్షల మంది అన్నదాతలను ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఉద్యాన వంటలకు కేంద్రంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల హెక్టార్లనూ.. 40 లక్షల హెక్టార్లకు పెంచుతామని వివరించారు. ఉద్యాన పంటల దిగుబడు లను 400మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామని తెలిపారు. రూ.30వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతుల కోసం రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తామని, లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.