దేశానికి డేటా గేట్వేగా ఏపీ నిలుస్తుంది
గ్రోత్ ఇంజిన్‌గా మారనున్న గూగుల్
2028 నాటికి గూగుల్ సెంటర్ పూర్తి
ఎంఓయూలతోనే కాదు.. వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం
గూగుల్ సెంటరు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
గూగుల్ డేటా సెంటర్ విశాఖ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొంది. 1 గిగావాట్ డేటా సామర్థ్యంతో తలపెట్టిన సెంటరుకు శంకుస్థాపన జరిగింది. మరోవైపు గూగులు మించిన సామర్థ్యంతో డేటా సెంటరు ఏర్పాటుకు మరో దిగ్గజ కంపెనీ రిలయన్స్ ముందుకొచ్చింది. 1.5 గిగావాట్ల క్లస్టర్ ఏర్పాటుకు ఆ సంస్థ చేసిన ప్రతిపాదనకు పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఓకే చెప్పింది. దీంతో డేటాకు తిరుగులేని కేరాఫ్ గా విశాఖ కొత్త అధ్యాయం ప్రారంభించినట్లయింది.
విశాఖపట్నం : గూగుల్ రాక.. విశాఖకే కాదు..ఏపీకి ఒక గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ చరిత్రలో మరచిపోలేని రోజు ఇదన్నారు. భారతదేశానికి ఏపీ.. అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, గూగులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్్కు భవిష్యత్‌లో తుర్లవాడ పేరు మార్మోగుతుందన్నారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుంది. కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. ఏఐ డేటా సెంటర్. ఒక గిగావాట్ సామర్థ్యంతో పని చేస్తుంది. సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. ప్రముఖ సంస్థలు విశాఖలో పెట్టుబడులకు రావడం శుభపరిణామం. గూగుల్ ఆవిష్కరణలు.. ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండూ కలుస్తున్నాయి. ఓడరేవుల వంటి రంగాల్లో పని చేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ అదానీ.. ప్రజలకు కమ్యూనికేషన్‌తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్టెల్.. ఈ మూడు సంస్థలు ఎప్పుడూ నూతన ఆలోచనలు చేస్తుంటాయన్నారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కావాలి. రెండు, మూడు నెలలు ముందుగానే వూర్తి చేసేందుకు సహకరిస్తాం. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తాం. భవిష్యత్‌లో అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుంది. వ్యాపార నిర్వహణ ఖర్చు.. మిగిలిన నగరాలకంటే చాలా తక్కువగా ఉ ంటుంది. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రారంభమవుతుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఎంవోయూలకే పరిమితం కాదు.. ముందుకు ఎలా తీసుకెళ్లాలో చూపిస్తున్నాం. పెట్టుబడులు, చంద్రబాబు కాదు.. ప్రారంభంలోనూ ముందున్నాం అని చంద్రబాబు అన్నారు. అలాగే విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్టెల్ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2028 చివరినాటికి ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని.. తెలిపారు. టెక్నాలజీలో దేశానికే గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉ ందని వెల్లడించారు. పెట్టుబడిదారులే ఏపీకిభాగస్వాములని చెప్పారు. ఒప్పందాలే కాదని.. గ్రౌండింగ్ కూడా తమదే బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఎఐ యుగంలో గూగుల్ డేటా సెంటర్ కీలకం గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే
కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ ఆనందపురం మండలం తరువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. వన్ గిగా వాట్ సామర్థ్యంతో రూ.1.35 లక్షల సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తరువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అన్ని రకాల అనుమతులను సర్కార్ క్లియర్ చేసింది. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ... గూగుల్ ఇండియా ఏఐ హబక్‌కు ఇవాళ చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు ఓ పునాదిరాయి లాంటిదన్నారు. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని అన్నారు. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వేగా ఉన్న ముంబై, చెన్నైలతో పాటు విశాఖ కూడా కీలకంగా మారిందని వెల్లడించారు. కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తాయని బికాస్ కోలే తెలిపారు. సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రాలు ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి ఫ్యూచర్‌ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉ ంటుందని చెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తామన్నారు. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలను గూగుల్ నిర్వహిస్తుందని తెలిపారు. 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంట ప్రైజ్‌గా మారేందుకు సహకారం అందిస్తుందని అన్నారు. న్యూ ట్రాన్స్ మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయన్నారు. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్థిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ నిర్మితం అవుతుందని బికాస్ కోలే వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత, బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.