టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ మారాయి. పింక్ కలర్ చీరలో, సముద్ర తీరాన సూర్యాస్తమయం వేళ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఈ ఫొటోలకు 'నమ్మ ఊరు పొన్ను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన ఉరిని గుర్తుచేసుకుంటూ ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలు చూద్దాం.. పూజా హెగ్దే లేటెస్ట్ ఫొటో షూట్లో పింక్ కలర్ సిల్క్ చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. సముద్రపు ఒడ్డున సూర్యుడు అస్తమిస్తున్న వేళ, ఆ వెలుగులో ఆమె అందం రెట్టింపు అయ్యింది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే తనదైన స్టైల్ తో గ్లామర్ టచ్ ఇచ్చింది పూజా. ఈ ఫొటోలు చూసిన అభిమానులు "బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.