విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో మార్చి 4న నిర్వహించనున్న తమ వివాహ విందుకు ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధానితో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం సాదాసీదాగా జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులే హాజరయ్యారు. అందుకే హైదరాబాద్‌లో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో భారీ స్థాయిలో రిసెప్షన్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.