ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రానున్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన ఫిట్నెస్ అసెస్మెంట్లో వీరిద్దరూ సక్సెస్ఫుల్లా పాస్ అయినట్లు ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఐపిఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ హ్యామ్ స్ట్రింగ్ గాయంతో, హార్దిక్ బ్యాక్ స్పాజమ్స్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంతో త్వరలోనే వీరు నేషనల్ స్క్వాడ్‌తో కలవనున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్ స్ట్రింగ్ ఇంజూరీ కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి కంప్లీట్‌గా రూల్ అవుట్ అయ్యాడు. ఐపిఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ డిఫెండ్ చేసుకున్న టైంలో కోహ్లికి ఈ గాయమైంది. కోహ్లి రికవరీ టైమ్లోన్పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అప్డేట్ ఇచ్చాడు. గాయం జరిగి ఇంకా వారం కూడా కాలేదని, ఫిజియోలు పరిశీలిస్తున్నారని చెప్పాడు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి కోహ్లి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, అది కచ్చితమైన సమాధానం కాదని అగార్కర్ స్పష్టం చేశాడు. కోహ్లి ప్లేస్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 13 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. మొదటి వన్డే జూన్ 13న ధర్మశాలలో జరుగుతుంది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో, చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న చెన్నైలో నిర్వహించనున్నారు. శుభమన్ గిల్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నాడు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఈ వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.