జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పాలన
దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప చేసిన మోడీ
ఎన్డీయే పక్షాల భేటీలో మోడీని అభినందించిన బాబు
దేశాభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి.. ప్రధాని మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచదేశాల్లో భారత్ గౌరవాన్ని మోదీ పెంచారని చెప్పారు. రాష్టాల్ర అభివృద్ధికి కూడా కేంద్రం పూర్తిగా మద్దతిస్తోందన్నారు. ఎన్డీయే ఏర్పడింది ఎన్నికల కోసం కాదు.. దేశం కోసం. అధికారం కోసం కాదు.. జాతీయ ప్రయోజనాల కోసం. రాష్ట్రాల్లో ఎన్డీయే సాధిస్తున్న వరుస విజయాలే మా పనితీరుకు సాక్ష్యం. బిహార్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు మళ్లీ మాకు పట్టం కట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఈ విజయాలు.. సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు. బెంగాల్.. మళ్లీ దేశానికి మార్గదర్శకంగా నిలిచే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పాలన, ఆవిష్కరణలే భారత్కు అతిపెద్ద బలం. అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి భారతీయుడి మనోభావాలు అర్థం చేసుకున్న నాయకుడు.. మోదీ అని చంద్రబాబు అన్నారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. దేశం గర్వించేలా చేయడంతో పాటు, ప్రపంచదేశాల్లో భారతదేశ గౌరవం పెంచేలా ప్రధాని మోదీ విశేష కృషి చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మద్దతుగా ప్రధాని నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదని... దేశం కోసం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాదని... జాతీయ లక్ష్యసాధన కోసం ఎన్డీఏ ప్రయాణం సాగుతోందని తెలిపారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తున్న విజయాలే సాక్ష్యమని చెప్పుకొచ్చారు. బీహార్లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీఏపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసోం గెలుపు మరోసారి విశ్వాసం వ్యక్తం చేసిందని.. పుదుచ్చేరి విజయం కూడా మరోసారి ఎన్డీఏకి మద్దతు తెలిపిందని ప్రస్తావించారు. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావని... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించారు. ఒకప్పుడు ఈరోజు పశ్చిమబెంగాల్ ఆలోచిస్తే... రేపు భారత్ ఆలోచిస్తుంది' అనే పేరు ఉండేదని చెప్పుకొచ్చారు. స్వాతంత్యం÷-ర తర్వాత దశాబ్దాల పాటు పశ్చిమబెంగాల్ అభివృద్ధి ప్రధాన స్రవంతికి దూరమైందని తెలిపారు. దేశ సంస్కరణలు, అభివృద్ధి వైపు సాగితే... పశ్చిమబెంగాల్ పాత రాజకీయాల్లోనే చిక్కుకుపోయిందని అన్నారు. తాజా మార్పుతో పశ్చిమబెంగాల్ దిశ మళ్లీ అభివృద్ధి వైపు సాగనుందని వివరించారు. మారుతున్న భారత ఆకాంక్షలకు అనుగుణంగా బెంగాల్ అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బెంగాల్ మళ్లీ దేశానికి మార్గదర్శకంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉ ందని ప్రస్తావించారు. భారతీయత పునరుజ్జీవం పొందడం గత 12 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద మార్పు అని పేర్కొన్నారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని ఉద్ఘాటించారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలమని తెలిపారు. 21వ శతాబ్దానికి భారత్ అందించే గొప్ప సందేశం ఇదేనని.. ఆత్మనిర్బర్ భారత్ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉ ండేలా ప్రధాని తీర్చిదిద్దుతున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్ధం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరని ఉద్ఘాటించారు. ప్రపంచ మార్పులో భారత్ భాగస్వామినే కాదని... దిశానిర్దేశర చేసే దేశంగా భారత్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.