తమిళ చలనచిత్ర చరిత్రలో గ్రామీణ కథలకు సరికొత్త దిశను చూపి, వెండితెరపై పల్లెటూరి అందాలను అత్యంత అద్భుతంగా అవిష్కరించిన సినీ దిగ్గజం, 'దర్శక ఇమయం' భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత చిత్రాలను అందించి, ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటును మిగిల్చింది. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, 1977లో విడుదలైన 16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి అప్పట్లోనే పెద్ద సంచలనం సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను అవుటోర్కు తీసుకొచ్చి, తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని, అక్కడి సహజత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే ఆయనను అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఎంతో గౌరవంగా 'దర్శక ఇమయం' అని పిలుచుకుంటారు. ఆయన కెరీర్లో సిగప్పు రోజక్కల్, జక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతి+- లలై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం తెలిపారు. సిఎం విజయ్ నివాళి అర్పించారు.
భారతీరాజా భౌతిక కాయం వద్ద సీఎం విజయ్ నివాళి
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజాకు సిఎం విజయ్ నివాళి అర్పించారు. భారతీరాజా నివాసానికి వెళ్లిన సిఎం ఆయన భౌ వద్ద ఘన సేవలను గుర్తు చేశారు. ఓదార్చారు. తమిళ చిత్ర పరిశ్రమకు చేసిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ వ్యవస్థాపకుడు, దిగ్గజ దర్శకుడైన భారతీరాజా తుది బీడ్కోలుకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలను కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ అభ్యర్థనకు స్పందించిన సీఎం విజయ్, ప్రభుత్వ గౌరవ వందనంతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రభావవంతమైన, విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మహోన్నత వ్యక్తి భారతీరాజా అని కొనియాడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్న ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' (2004) పురస్కారంతో పాటు 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మరియు మరెన్నో ప్రశంసలను ఆయన అందుకున్నారని గుర్తుచేసింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన సహకారం అసమానమైనదని, ఒక దర్శకుడిగా ఎన్నో కాలాతీత క్లాసిక్ చిత్రాలను సృష్టించడమే కాకుండా, నటుడిగానూ తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించింది. 2020లో పలువురు నిర్మాతలతో కలిసి భారతీరాజా తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' ను స్థాపించారని, ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఈ అసోసియేషన్ స్థిరంగా వృద్ది చెంది ప్రస్తుతం 400 మందికి పైగా క్రియాశీల నిర్మాతలకు ప్రాతినిధ్యం వహిస్తోందని సంస్థ తెలిపింది. నిర్మాతలు, దర్శకులు, నటుల సంక్షేమం కోసం మరియు తమిళ సినిమా సమగ్ర అభివృద్ధి కోసం ఆయన ఎల్లప్పుడూ అందితభావంతో పనిచేశారని, అసోసియేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆయన నిరంతరం మద్దతుగా నిలిచారని ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ ప్రకటనలో కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంది.
భారతీరాజా మృతి తీరని లోటు నివాళి అర్పించిన మెగాస్టార్ చిరంజీవి
విలక్షణ కథాంశాలతో యావత్ దేశాన్ని మెప్పించిన ఈ 'దర్శక శిఖరం' భారతీరాజా మరణవార్తతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఆయన భౌతికకాయానికి నివాళు లర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ విషాద సమయంలో మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ అత్యంత ఎమోషనల్ అయ్యారు. భారతీయ చలనచిత్ర రంగం ఇవాళ ఒక అసాధారణ కథకుడిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరి మట్టి పరిమళాలను, అచ్చమైన మానవ సంబంధాల సున్నితత్వాన్ని, అమాయకత్వంతో కూడిన ప్రేమను, సామాన్యుల జీవితాల్లోని భావోద్వేగాలను వెండితెరపై అద్భుతమైన కావ్యాలుగా మలిచిన ఘనత భారతీరాజా గారికే దక్కుతుందని చిరంజీవి కొనియాడారు. ఆయన సృష్టించిన చిత్రాలు కేవలం ప్రేక్షకులను అలరించడమే కాకుండా, రాబోయే ఎన్నో తరాల యువ దర్శకులకు దిక్సూచిలా, స్ఫూర్తిప్రదాతగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1987లో భారతీరాజా గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ ఎమోషనల్ డ్రామా 'ఆరాధన' చిత్రంలో తామిద్దరం కలిసి పనిచేసిన మధుర జ్ఞాపకాలను చిరంజీవి ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఆ సినిమాలో తాను పోషించిన 'పులిరాజు' అనే వైవిధ్యమైన పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకమని, అటువంటి గొప్ప పాత్రను తనతో చేయించిన అదృష్టం ఆ దర్శకేంద్రుడి వల్లే దక్కిందని చెప్పారు. షూటింగ్ సమయంలో సినిమా పట్ల భారతీరాజా గారికి ఉన్న ప్యాషన్, ఆయన చూపించిన అంకితభావం, అంత పెద్ద దర్శకుడైనా ఆయనలో ఉన్న, నిరాదంబరత్వం తన మనసుపై ఎనలేని ముద్ర వేశాయని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని, ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ చిరస్కరణీయంగానే ఉంటారని పేర్కొంటూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భారతీరాజా మృతికి చంద్రబాబు సంతాపం
భారతీరాజా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారతీరాజా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. 'భారతీరాజా మరణం బాధాకరం, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను' అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తనదైన ముద్ర వేసిన దర్శకుడు భారతీరాజా ఎక్స్ వేదికగా నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్
ప్రముఖ దర్శకులు భారతీరాజా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారతీరాజా మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, ప్లలె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్క ఉందే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక' ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో 'ఆరాధన' చిత్రం రూపొం దించారు. అందులో అరె ఏమైంది..' అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, భారతీరాజా మర ణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.