విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్ లోని Xుజ మెమెంటోస్ (ఎకాయా ఉదయపూర్) హోటల్లో ఘనంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడు ముళ్లు వేసినట్లు సమాచారం. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో మేళ తాళాల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగిందని తెలుస్తోంది. ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా విజయ్ దేవరకొండ -- రష్మిక మందన్న ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టారు. దాదాపు 8 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి అభిమానులను ఖుషీ చేశారు. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటి కావడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శు భాకాంక్షలు తెలుపుతున్నారు. అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.