పదిహేనేళ్ల క్రితం ప్లాన్ చేస్తే ఇప్పుడు కుదరింది
ఈ సినిమాలో రాముడిగా మహేష్ బాబు కనిపిస్తారు
అత్యద్భుత దృశ్యకావ్యంగా మూవీని విడుదల చేస్తున్నాం
అంతర్జాతీయ మీడియాతో రాజమౌళి, మహేశ్ బాబు
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న 'వారణాసి' ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఎన్నో రోజుల నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూసిన అభిమానులకు చాలా విశేషాలు వచ్చేశాయి. చిత్రబృందం ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' గురించి వంచుకుంది. దీంతో ఈ చిత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాముడిగా మహేశ్ బాబు కనిపించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక రాజమౌళి ఈ సినిమా నిడివితో పాటు 'అవతార్'తో పోల్చడం గురించి మాట్లాడారు. నాకు ఉన్న కొన్ని కమిట్మెంట్ ల కారణంగా మహేష్ బాబుతో సినిమా ఆలస్యం అయింది. లేదంటే 15 ఏళ్ల క్రితమే తీసేవాడిని. ఇప్పుడు వారణాసిని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్లలో సందడి చేయనుంది. నేను సినిమాలు ఆలస్యం చేస్తాననే చెడ్డపేరు ఉంది. ప్రొడక్షన్ పనులు లేట్ చేస్తానని వాయిదాలు వేస్తానని అంటారు. ఈ విషయంలో నెటిజన్లు కూడా చాలాసార్లు కామెంట్స్ చేశారు. 'వారణాసి' 3.20 గంటల నిడివితో విడుదలవుతుంది. ఇంత ఎక్కువ నిడివిలో మూడు నిమిషాలు ఆసక్తిగా లేకపోయినా వెంటనే ఆడియన్స్ ఫోన్ తీసుకుంటారు. మేం అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టకుండా దీన్ని రూపొందిస్తున్నాం. ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఆసక్తి కలిగేలా.. కొత్త అనుభవాన్ని ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అని రాజమౌళి తెలిపారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ప్రపంచం 'అవతార్'తో రాజమౌళి వారణాసి'ని పోల్చడంపై ఆయన మాట్లాడారు. అలాంటి వ్యక్తితో పోల్చడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నా కానీ, ఆయనతో నన్ను పోల్చొద్దు. ఆయన ఒక శిఖరం. ఆయన మాస్టర్. నేను ఇంకా విద్యార్థినే. 'వారణాసి'లో 26 నిమిషాలు పురాణాలపై చిత్రీకరించాం. ప్రేక్షకులు ఎప్పటికీ ఆ సన్నివేశాలను మర్చిపోలేరు. ప్రస్తుతం ఇంతవరకూ మాత్రమే చెప్పగలను అని దర్శకధీరుడు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దయచేసి నాకు ఈ సినిమాలో డ్యాన్స్ వేసే అవకాశం ఇవ్వండి. మంచి పాట ఉండేలా చూడండి' అని చెప్పాని ప్రియాంక అన్నారు. ఈ సినిమాలో వారి పాత్రల దగ్గర నుంచి కథ ఎలా మొదలైంది వరకూ మహేశ్ బాబు విశేషాలు తెలిపారు. 15 ఏళ్ల కిత్రమే రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సిఉంది. ఇప్పటికి అది కుదిరింది, 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన తర్వాత ఏడాది పాటు దీని స్క్రిప్ట్ గురించి ఆలోచించారు. నన్ను ఆఫీసుకు పిలిచి 'వారణాసి' స్క్రిప్ట్ గురించి చెప్పారు. కథ విని ఆశ్చర్యపోయాను. ఇప్పటివరకూ రాజమౌళి చేసిన అన్ని చిత్రాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎన్నో అంశాలు ఉ న్నాయి. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైమ్ ట్రావెల్.. ఇలా ఎన్నో ఉన్నాయి. రాజమౌళి అభిమానిగా ఈ సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఉన్నాను. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయవడ్డాను. రాజమౌళి కథను వివరించిన విధానం నా భయాన్ని పోగొట్టిందని మహేశ్ బాబు అన్నారు. 'వారణాసి'లో లుక్స్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం. 2024 నుంచి ఈ పనిలోనే ఉన్నాం. గతేడాది జర్మనీ కూడా వెళ్లాం. నేను ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం.. ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది. నిలబడే విధానం దగ్గర నుంచి పాత్రలో నటించడం వరకూ ఎన్నో రిహార్సల్స్ చేశాం. 2,3 నెలలు దానికోసమే కష్టపడ్డాం. రాజమౌళి నేను పరిగెత్తే విధానాన్ని కూడా మార్చారు. దానికోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాను. సినిమాలో రెండు షాట్ల కోసం ఇదంతా చేశాం. ఆయనకు సినిమాపై ఉన్న శ్రద్ద ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు, ఈ సినిమా భారీస్థాయిలో విడుదలవుతుంది. 'వారణాసి' లో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ 'కుంభ' అనే ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో ఇదే అత్యంత విభిన్నమైన, అంచనా వేయలేని పాత్ర అని ఆయన తెలిపారు. ఈ కుంభ క్యారెక్టర్ పూర్తిగా గ్రే షేడ్స్ సాగుతుందని చెప్పారు. ఎప్పుడు ఏం చేస్తాడో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఈ పాత్రను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. తన నిజజీవితానికి పూర్తిగా భిన్నమైన డార్క్ రోల్ కావడం వల్ల ఇది తనకు పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వీల్చర్, 'డాక్టర్ అక్టోవస్' తరహాలో రోబోటిక్ చేతులు వంటి ఎలిమెంట్స్ పృథ్వీరాజ్ లుక్ భయానకంగా ఉ ండనుందని సమాచారం. కేవలం కళ్లతోనే భయపెట్టే విధంగా ఈ పాత్రను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చూడని సైకలాజికల్ విలన్‌గా 'కుంభ' నిలుస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి 'వారణాసి'లో హీరో మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' పాత్రకు సమానంగా నిలిచే 'కుంభ' విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది.