19ననే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్ . ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఉగాదికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. 'ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత' అంటూ కొత్త పోస్టర్ను మేకర్స్ పంచుకున్నారు. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని భావించారు. అన్ని పనులు పూర్తి కావడంతో వారం ముందుగానే మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. పోలీస్ ఆఫీసర్గా పవన్ స్టైలిష్ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, వీడియోలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.