మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులే మీ మనసుని ఎక్కువగా పరీక్షిస్తారంటూ తన కలల ప్రపంచంలోని పరిస్థితుల గురించి పంచుకుంటోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. చిన్న గ్రామంలో కలలు కంటూ.. ట్రైన్ ఎక్కైనా కొరియా వెళ్తానంటూ మొదలైన తన ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే 'మేడ్ ఇన్ కొరియా' చూడాల్సిందే. క్రాస్ కల్చర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని రా. కార్తిక్ తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ఒరిజినల్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 12 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా అధికారిక ట్రైలర్‌ను ఆవిష్కరించింది. నెటిక్స్. 'కొన్నిసార్లు మీరు ఊహించని వ్యక్తుల నుంచి ప్రేమని పొందుతారు.. కొరియా పట్ల నాకున్న ప్రేమ నన్ను నేను తెలుసుకునేలా చేసింది' లాంటి ఆసక్తికరమైన డైలాగులు.. కొరియాలో ఎదురైన చేదు అనుభవాల ప్రియాంక సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉందీ ట్రైలర్. ఈ సినిమాలో దక్షిణ కొరియా నటుడు పార్క్ హై జిన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఓ తమిళ అమ్మాయి కొరియా వెళ్లిన నేపథ్యంతో రూపొందిందీ చిత్రం.