కళ్ల ముందే గోదావరి కలుషితం... నిద్రపోతున్నారా?
అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం
పరిశ్రమల వ్యర్థ జలాల్లో ప్రమాదకర రసాయనాల గుర్తింపు
శాశ్వత పరిష్కారానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం
అమరావతి : గోదావరి నది కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిద్రావస్థలో ఉ న్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పొల్యూషన్ లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల ఆందోళనకర స్థాయిలో కాలుష్యం కాలుష్యం పెరిగినట్లు పెరిగినట్లు కంట్రోల్ బోర్డు ల్యాబ్ నివేదికలో నివేదికలో తేలడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పవన్ విమర్శించారు. కళ్ల ముందే గోదావరి కలుషితమవుతున్నా ఇన్ని రోజులు తీసుకోలేదని ఎందుకు చర్యలు అధికారులను ప్రశ్నించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్ర వరం మున్సిపల్ కార్పొరేషన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మే 25న జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా బోటులో వెళ్లి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల పరీక్షల్లో అనుమతించ దగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికపై తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సోమవారం నిర్వహించిన అత్యవసర సమీక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా సంబంధిత అధికా రులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
ఆందోళనకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా
రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో సేకరించిన నీటి నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి 500 ఎంఫీఎన్ మిల్లీ లీటర్లలోపు ఉండాల్సి ఉ ండగా 2,420 ఎంఫీఏన్గా నమోదైంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 3 ఎంజీ లీటర్ లోపు ఉండాల్సి ఉండగా 5.2 ఎంజీ లీటర్లుగా తేలింది. నీటి స్వచ్ఛత సూచిక 5 ఎన్టీయూ ఉ ండాల్సి ఉండగా 8.4 నుంచి 14.2 ఎన్టీయూ వరకు నమోదైంది. మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 250 ఎంజీ లీటర్లలోపు ఉండాల్సి ఉండగా 263 ఎంజీ లీటర్లుగా తేలింది. నైట్రేట్ పరిమితి 45 ఎంజీ లీటర్లు ఉండాల్సి ఉండగా 119.6 ఎంజీ లీటర్లుగా నమోదైంది. ఈ నీరు స్నానాలకు, గృహ అవసరాలకు అనుకూలం కాదని, కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధుల ముప్పు ఉందని నివేదిక పేర్కొంది.
వరిశ్రమ వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు
ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ వద్ద సేకరించిన నమూనాల్లో సల్ఫైడ్, ఫాస్పేట్లు, ఇతర కాలుష్య కారకాలు పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 30 ఎంజీ లీటర్లలోపు ఉండాల్సి ఉండగా 36 ఎంజీ లీటర్లుగా నమోదైంది. ఫాస్పేట్ స్థాయి 5 ఎంజీ లీటర్లకు బదులుగా 5.3 ఎంజీ లీటర్లు, సల్ఫైడ్ స్థాయి 2 ఎంజీ లీటర్లకు బదులుగా 3.4 ఎంజీ లీటర్లుగా నమోదైంది. ఈ వ్యర్థ జలాలు లు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై, మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నా యని నివేదిక పేర్కొంది.
డీపీఆర్ సిద్ధం చేయాలి
రాజమహేంద్రవరం నగరంలో ఉత్పత్తి అవు తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ది లేకుండా గోదావరిలో కలవకూడదన్నారు. నగరంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీరు, భవిష్యత్ అవసరాలు, అవసరమైన శుద్ధి కేంద్రాల సంఖ్య, వ్యయ అంచనాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.