సమంత అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న చిత్రం 'మా ఇంటి బంగారం'. దర్శకురాలు మినహా ఇప్పటివరకూ ఎవరూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను సామ్ షేర్ చేశారు. ఈ సంక్రాంతికి టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్న సమంత.. ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. 'మీరు చూస్తా ఉ ండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అంటూ రాశారు. జనవరి 9న ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు సంబర వడుతున్నారు. 'క్వీన్ ఈజ్ బ్యాక్' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఓ బేబీ' తర్వాత సమంత దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. గతేడాది అక్టోబర్ 2న దీని షూటింగ్‌ను ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ వతాకంపై సమంత నిర్మిస్తున్న రెండో చిత్రమిది. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలు. 1980ల నేపథ్యంలో సాగే కైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్' లో నటిస్తున్నారు. దర్శకద్వయం రాజ్, డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతోంది.