20 సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడి
కువైట్, బహ్రెయిన్, యూఏఈలలో మిస్సైళ్ల వర్షం
కువైట్‌లో ఆరుగురు అమెరికన్ సైనికులు మృతి
హర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ట్యాంకర్‌పై దాడి
నౌక నుంచి ఎగసిపడుతున్న మంటలు
అజర్‌బైజాన్‌పై డ్రోన్ల దాడి
ఇరాన్లో మృతులు 1,260
శ్రీలంక వద్ద హిందూ మహాసముద్రంలో తన యుద్ధ నౌకను ముంచివేసిన అమెరికాపై ఇరాన్ కక్ష గట్టింది. నౌకపై దాడికి ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్, యూఏఈలలో 20 అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల వర్షాన్ని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీన్) కురిపించింది.కువైట్‌లో అరిప్టాన్ బేస్, అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షుఐబా పోర్ట్ వంటి ప్రాంతాలు లక్ష్యంగా చేసుకున్నారు. షుఐబా పోర్ట్ డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బహ్రెయిన్‌లో అమెరికా నేవీ ఐదవ ప్లీట్ హెడ్‌క్వార్టర్స్, జుఫైర్ ఎయిర్ బేస్ వంటి స్థావరా లు దెబ్బతిన్నాయి. యూఏఈలో అల్-మిన్హాద్ ఎయిర్ బేస్, అల్-ధప్రా ఎయిర్ బేస్ పై దాడులు జరిగాయి. ఐఆర్డీసీ ప్రకటన ప్రకారం, కువైట్‌లో 12 డ్రోన్లు, యూఏఈలో ఆరు డ్రోన్లు, ఐదు బాలిస్టిక్ మిస్సైళ్లు, బహ్రెయిన్‌లో ఆరు డ్రోన్లు వాడారు. ఈ దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం జరిగిందని ఇరాన్ చెబుతోంది. అమెరికా వైపు నుంచి ఇంటర్సెప్ట్ చేసినా, కొన్ని దాడులు విజయవంతమ య్యా యి. శాటిలైట్ చిత్రాలు, వీడియోలు ఆధారాలు కూడా నష్టా న్ని చూపిస్తున్నాయి. కువైట్, బహ్రెయిన్, యూఏఈలో ఎయి ర్ రైడ్ సైరన్లు మోగాయి. అమెరికా సైనికులు మరణించిన సంఘటనలు ఇది మొదటి పెద్ద నష్టంగా మారిం ది. ఈ దాడులు యుద్ధాన్ని గల్ఫ్ ప్రాంతానికి విస్తరింప జేశాయి.
అమెరికా ట్యాంకర్‌పై మిస్సైల్‌తో దాడి
అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్డీసీ) ప్రకటన ప్రకారం, ఉత్తర పర్షియన్ గల్ఫ్ లో అమెరికా చమురు ట్యాంకర్‌ను క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి తర్వాత నౌకలో భారీ మంటలు చెలరేగాయి. తమ యుద్ధ నౌక ఐరిస్ డెనాను అమెరికా సబ్‌మెరైన్ టార్పిడోతో ముంచిన ప్రతీకారంగా ఈ దాడిని చేశామని ఐఆర్టీసీ పేర్కొంది. ఈ సంఘటన హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగింది. ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వ మీడియా, తన్నిమ్, ఫార్స్ వంటి సంస్థలు ధృవీకరించాయి. నౌక ఉత్తర గల్ఫ్ లో ఉండగా క్షిపణి దాడి జరిగిందని, మంటలు ఎగిసిపడుతున్నాయని తెలిపాయి. అయితే అమెరికా వైపు నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. బ్రిటిష్ మెరైటైమ్ సెక్యూరిటీ జరిగినట్లు నివేదించాయి. కువైట్ తీరం సమీపంలో ఒక ట్యాంకర్ పేలుడు, చమురు చిందిందని కూడా సమాచారం. సంస్థలు, యూకేఎన్జీవో వంటివి గల్ఫ్ లో ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు నివేదించాయి.కువైట్ తీరం సమీపంలో ఒక టాంకర్ పేలుడు, చమురు చిందిందని కూడా సమాచారం.
అజర్జెజాన్పై డ్రోన్ల దాడి
అజర్‌బైజాన్‌పై డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. గురువారం ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు అజర్‌బైజాన్‌లోని నఖ్చివాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని రాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేశాయి. ఒక డ్రోన్ విమానాశ్రయటె ర్మినల్ భవనంపై పడి పేలింది, మరొకటి షకరాబాద్ గ్రామంలోని పాఠశాల సమీపంలో పడింది. ఈ దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు గాయపడ్డారు, విమానాశ్రయ భవనానికి భారీ నష్టం జరిగింది. ఇరాన్ భూభాగం నుంచి ఈ దాడులు జరిగాయని అజర్బైజాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఆరోపణలను ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాద్ తిరస్కరించారు. ఇరాన్లో మర ణాల సంఖ్య 1,260కి చేరుకుంది. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకారం, ఇరాన్లో ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మరణాలు 1,260కి పెరిగాయి. గాయపడినవారు వేల సంఖ్యలో ఉన్నారు.