మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు', సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రీజినల్ ఇండస్ట్రీలో హిట్గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని ఫుల్ ఫామ్లో చూసిన అభిమానులు ఈ సినిమాను పండగలా సెలబ్రేట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించగా, ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా నిర్మించినందుకు రామ్ చరణ్.. తన సోదరి సుస్మితకి క్యూట్ గిఫ్ట్ ఇచ్చారు. సుస్మిత కొణిదెల రీసెంట్గా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.ఇప్పుడు నీకు దిష్టి తగులుతుంది కాబట్టి ఇది వేసుకో అని రామ్ చరణ్ తన అక్కకి ఈవిల్ ఐ బ్రేస్లెట్ని గిప్ట్ ఇచ్చాడని రామ్ చరణ్ సోదరి సుస్మిత తెలియజేశారు. తమ్ముడు చూపించిన ప్రేమపై మెగా డాటర్ ఫుల్ ఖుష్ అయింది. ఆమె చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.