-స్పైడర్ రిలీజ్ ముందు వరకూ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేది. జయాపజయాలతో సంబంధం లేకుండా అమ్మడు తెలుగు అవకాశాలు అందుకుంది. కానీ -స్పైడర్- రిలీజ్ అనంతరం సీన్ మారింది. అప్పటి నుంచి అవకాశాలు తగ్గాయి. అలాగని పూర్తిగా అవకాశాలే లేకుండా పోలేదు. ఏదో సినిమాలో ఛాన్స్ అందుకుని టచ్ లో ఉండేది. కానీ బాలీవుడ్ లో రీలాంచ్ అయిన తర్వాత మాత్రం తెలుగు సినిమాల్ని లైట్ తీసుకుంది. ఆ సమయంలో వచ్చిన టాలీవుడ్ అవకాశాలు కూడా కాదంది. కానీ అనూహ్యంగా బాలీవుడ్ అవకాశాలతో బిజీ అయింది. ఎంతలా అంటే ఊపిరి సలవనంతగా సినిమాలు చేసింది. ఇదే సమయంలో వరుసగా కోలీవుడ్ లో కూడా అవకాశాలు ఊపందుకున్నాయి. దీంతో తమిళ, హిందీ భాషల్ని బ్యాలెన్స్ చేసి కెరీర్ ని ముందుకు తీసుకెళ్లింది. దాదాపు కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ 18 హిందీ సినిమాలు చేసింది. -యారియాన్- బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటుపై -అయ్యారీ-, -దే దే ప్యార్ దే- లో నటించింది. ఈ సినిమా అమ్మడికి బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఉత్తరాదిన రకుల్ హవా తగ్గిందా? అన్న ప్రచారం ఊపందుకుంది. అటు భర్త జాకీ భగ్నానీ కూడా ఆర్ధిక సంక్షో భంలో ఉన్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్ లతో పూజ ఎంటర్ టైన్ మెంట్స్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఉన్న ఆస్తులు కూడా అమ్మాల్సి వచ్చింది. ఈ సమయంలో రకుల్ సినిమాలు కొంత కాలం పాటు ఫ్యామిలీకి అండగా నిలిచాయి. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు తగ్గడం మరింత ప్రతికూల పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది.