దక్షిణాదితోపాటు అటు హిందీలోనూ అప్పుడప్పుడూ అవకాశాల్ని అందుకుంటున్న రాశీఖన్నాకి అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం సొంతమైనట్టు సమాచారం. తెలుగులో విజయవంతమైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో భార్య పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా, ప్రియురాలి పాత్రలో రాశీఖన్నా నటించనున్నట్టు సమాచారం. తెలుగులో మీనాక్షి చౌదరి చేసిన పాత్ర రాశి సొంతమైందన్నమాట. మొదట మీనాక్షి పేరునే పరిశీలించిన చిత్రబృందం, ఆ తర్వాత ఆ పాత్ర కోసం రాశిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.