బుట్టబొమ్మ పూజాహెగ్దే వృత్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి సాత్ కి మళ్లీ కంబ్యాక్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటుంది. టాలీవుడ్ పక్కన బెట్టినా కోలీవుడ్ మాత్రం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. ఈ క్రమంలోనే వూజాహెగ్దే పేరు మీడియాలో వైరల్ అవుతుంది. లేదంటే? అమ్మడు పేరు కనుమరుగైపోయేది. కోలీవుడ్ అవకాశాలతో మెల్లగా మళ్లీ టాలీవుడ్ లోనూ బిజీ అవ్వాలని చేయని ప్రయత్నం లేదు. పాత పరిచయాలతో మళ్లీ అవకాశాలు అందుకునే చర్యలు చేపట్టింది. ఇదంతా ప్రొఫెషనల్ లైఫ్. మరి అమ్మడి వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వూజాహెగ్దే కి తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని వెతికే పనిలో వడ్డట్లు తెలుస్తోంది. అమ్మడి వయను ఇప్పటికే 35 ఏళ్లు నిండటంతో పెళ్లి చేసుకోమని ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారుట. కొన్ని నెలలలుగా ఈ ఒత్తిడి మొదలైన నేపథ్యంలో తాజాగా పెళ్లి విషయంలో సంబంధాలు చూడండని చెప్పిందిట. డాడ్ మంజునాధ్ హెగ్దే.. మామ్ లతా హెగ్దే ఓ పెద్ద వ్యాపారవేత్త కుటుంబం నుండి సంబంధాన్ని వరిశీలిస్తున్నట్లు తెలిసింది. ముంబైకి చెందిన బిజినెస్మెన్ ఆమె పెళ్లి ఉండవచ్చని వార్తలొస్తున్నాయి. మరి ఈ వ్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. వూజాహెగ్దే మనసులో ఎవరైనా ఉన్నారా? లవ్.. రిలేషన్ షిప్ అంటూ కొందరి పేర్లు గతంలోనే తెరపైకి వచ్చాయి. దివంగత నటుడు నవినోద్ మోహ్రా కుమారుడు, నటుడు రోహన్ మెహ్రా సన్నిహితంగా ఉంటుందనే ప్రచారం జరిగింది. వీరిద్దరూ వలుమార్లు ముంబైలో కెమెరా కంటికి చిక్కారు. 2024 ఏప్రిల్లో పూజా తల్లిదండ్రులతో కలిసి రోహన్ లంచక్కు వెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అటుపై -కిసీకా భాయ్ కిసీకా జాన్- షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తోనూ ప్రేమలో ఉందనే ప్రచారం జరిగింది.