దక్షిణాదిన అగ్రస్థానంలో ఉన్న కథానాయిక ఎవరంటే.. 'నయనతార' అని టక్కున చెప్పేస్తారు. పారితోషికం పరంగా కూడా నయనే నంబర్ వన్. ప్రస్తుతం ఆ భాష, ఈ భాష అని లేకుండా, అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నది నయనతార. మెగాస్టార్ ఆమె రీసెంట్ హిట్ 'మన శంకర వరప్రసాదారు' టాలీవుడ్ రీజనల్ సినిమాల్లో నంబర్‌వన్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ 'ఎన్బీకె 111'లో కథానాయికగా నటిస్తున్నది నయనతార. ఇక తమిళంలో అయితే.. ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇదిలావుంటే.. రీసెంట్గా ఓ బాలీవుడ్ సినిమాకు నయన్ సైన్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మానాఖాన్ హీరోగా రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ పైడిపల్లి వంశీ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నది. ఇక నయన్ నటించిన తమిళ చిత్రం 'ముక్తీ అమ్మన్' నమ్మర్లో విడుదల నుంది.