'దూత' వెబ్్సరీస్లో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్ కు సీక్వెల్ సిద్ధమవుతోంది. శుక్రవారం పూజా కార్యక్రమాలు జరగ్గా.. నాగార్జున క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఈ సీక్వెల్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. 'దూత సెకండ్ చాప్టర్లో నిర్మాతగా నా తొలి అడుగు' అంటూ నాగచైతన్య ఫొటోలు పంచుకున్నారు. మరోసారి మ్యాజిక్ చూడడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'దూత'.. 2023 డిసెంబరు 1న 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో విడుదలై పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో జర్నలిస్టు సాగర్ వర్మ అవధూరిగా నాగచైతన్య