పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
స్వచ్ఛతకు, పచ్చదనానికి ఏయూ ఆదర్శం కావాలి విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూలో మొక్క నాటిన సీఎం చంద్రబాబు మొక్కలు నాటిన వారికే ఎన్నికల్లో టిక్కెట్లు..
చంద్రబాబు సరదా వ్యాఖ్యలు
విశాఖసిటీ : రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించ డమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రోజురోజుకూ పర్యా వరణ సమతుల్యత దెబ్బతింటోందని... ఓవైపు విపరీతమైన ఎండలు, లేదంటే తుఫానులు వస్తున్నాయని ఈక్రమంలోనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వ హించిన కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొని మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినో త్సవం సందర్భంగా ఏయూ గ్రౌండ్లో ముఖ్యమంత్రి తిరుమలతరహా లో ఏయూ క్యాంపస్‌లోనూ గ్రీనరీ పెరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం క్యాంపస్‌లో ఉన్న 25 శాతమే గ్రీనరీని 50 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఏయూ వీసీని సీఎం చంద్రబాబు ఆదేశిం చారు. స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శం గా మారాలని, నెట్ జీరో క్యాంపస్‌గా ఏయూను నిలపాలన్నారు. ఆంధ్ర యూనివర్శిటీకి 450 ఎకరాల సువిశాల క్యాంపస్ ఉ ందని, ఖాళీ ప్రదే శాల్లో చెట్లు పెంచడంతో పాటు... బిల్డింగుల మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలన్నారు. క్యాంపసక్కు అవసరమైన విద్యుత్‌ను సొంతం గా ఉత్పత్తి చేసుకోవాలని, ఇప్పటికే రూ.5,18,000 విలువైన విద్యుత్ అయిందన్నారు. క్యాంపస్ ను బయోడైవర్శిటీ పార్కుగా తీర్చిదిద్దా లని, హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే చెత్త, చెట్ల ఆకులను కంపోస్టా మార్చాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లకూడదని, శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉ వయోగించాన్నారు. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ వంటలకు వినియోగించుకోవాలని, నెట్ జీరో విధానం అమలు చేయడానికి ప్రొఫెనర్స్ టీం ఏర్పాటు చేయాలన్నారు. పర్యా వరణానికి సంబంధించి విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్ తయారవ్వాలి. ప్రపంచంలోని టాప్ నాలెడ్జ్ వర్సిటీల సరసన ఏయూను నిలపాలి. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లను అందుబాటు లోకితీసుకురావాలన్నారు. శాసన సభస్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటుతూ అధిక మొక్కులు నాటిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామంటూ సిఎం చంద్రబాబు సరదా వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో కాలుష్య నియంత్రణ చర్యలు
విశాఖలోకాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు దగ్గర నుంచి మొదలు కుని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లంటూ సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. సైక్లింగ్ ద్వారా రెండు విధాలుగా లాభం ఉందని... కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్నెస్ పెంచుకోవచ్చని సీఎం అన్నారు.
ఐదున్నర కి.మీ...21.18 నిమిషాలు.. ఉ త్సాహంగా సైకిల్ యాత్ర
పర్యావరణ పరిరక్షణపై అందరిలో చైతన్యం తెచ్చేలా శుక్రవారం విశాఖలోని ఏయూ ఏయూ హెలిఫ్యా హెలిఫ్యాడ్ మైదానం నుంచినొవెటెల్ వరకూ సీఎం చంద్రబాబు సైకిల్‌పై ప్రయాణించారు. ఎర్రటి ఎండ కాస్తున్నా. సీఎం ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నుంచి 3 టౌన్ పీఎస్ జంక్షన్, పోలమాంబ గుడి, వుడా పార్క్, వైఎం సీఏ, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్‌కు సైకిల్‌పై వెళ్లారు. మొత్తం ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని 21.18 నిమిషాల్లోనే చేరుకున్నారు. సీఎంతో పాటు సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
విశాఖలో సైకిల్పాత్ ఏర్పాటు చేస్తాం.
విశాఖ సుందరమైన నగరమని, ఇటువంటి నగరంలో సైకిల్‌పై ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని, త్వరలోనే ఇక్కడ సైకిల్ పాత్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నెట్ జీరో కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహక రించాలని, ఏ కార్యక్రమం ప్రారం భించినా విశాఖ వాసులు ఎంతో విజయవంతం చేస్తారన్నారు. అనేక సందర్భాల్లో నాకు అండగా నిలబడ్డారని, విశాఖకు పెట్టుబడు లు తీసుకురావడం ద్వారా రుణం తీర్చుకుంటామన్నారు. విశాఖను నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తుంటే కొందరు తప్పుడు చేస్తున్నారని. రాబోయే రోజుల్లో అనేక అవకాశాలుకు విశాఖ కేంద్ర బిందువు అవుతుందన్నారు. అన్ని దేశాల నుంచి నేర్చుకునేందుకు, పనిచేసేం దుకు విశాఖ వచ్చే పరిస్థితి వస్తుందని, త్వరలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి గోదావరి నీళ్లు విశాఖకు తెస్తామన్నారు.