రాజధాని పేరుతో మళ్లీ రగడ
జగన్ దగ్గరకు వెళ్లిన రైతులే భూములిస్తామని తిరిగొస్తున్నారు
అగ్రోగోల్డ్ సమస్య పరిష్కారానికి త్వరలో జీవోఎం నెలాఖరు వరకు ప్రజలతో మమేకం కావాలి నదీ జలాల కాలుష్యాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నిర్వహణపై కేబినెట్లో చర్చ
రెండేళ్ల ఎన్డీయే కార్యక్రమాలు వివరించాలి
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి: రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరచాకం. సృష్టించాలని కుట్రలు చేస్తోంది.. ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలి.. మీరు యాక్టివ్ ఉండాలి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా వక్రీకరిస్తోంది.. ఇకపై మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.. గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులతో ఆంతరంగికంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.. మెగా డీఎస్సీ అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాం.. రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పన ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాల్లో రాజీపడలేదు.. అన్నీ చేస్తున్నా తమ ఉనికిని చాటుకునేందుక - గొడ్డలి పార్టీ అభూతకల్పనలు సృష్టిస్తోంది.. మంత్రులు నిస్తేజాన్ని విడనాడాలి.. ప్రతిపక్ష ఆరోపణలపై తక్షణమే స్పందించి కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.. డీఎస్సీలో అక్రమాల ఆరోపణల తో సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.. తప్పుడు ఆరోపణలకు ఇకపై చెక్ పెట్టాలని ఆదేశించారు.రాజధాని అమరావతిపై మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు.. నిన్న ఆయన దగ్గరకు వెళ్లిన రైతులే తిరిగి మనవద్దకు వచ్చి భూములిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.. మంత్రి నారాయణ దగ్గరకు ఇరువురు రైతులు వచ్చి స్వచ్ఛందంగా రాజధానికి భూములప్పగిస్తామని ప్రకటించారు.. అయినా ఆ పార్టీ బూటకపు ప్రచారం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అగ్రిగోల్డు సమస్య త్వరలో పూర్తి స్థాయి పరిష్కారం కావాలని ఇందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.. మంత్రులంతా బాధ్యతగా వ్యవహరించాలని ఉద్బోధించారు.. ఇకపై ప్రజలతో మమేకం కావాలి.. గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన సంక్షేమ.. అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గోదావరి పుష్కరాలు.. నదీ జలాల కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రస్తావించారు. గోదావరిలో వ్యర్థాలు పేరుకుపోయిన వైనాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గోదావరి మాత్రమే కాదు.. రాష్ట్రంలో అన్ని నదుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబనదీ జలాల కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో డిప్యూటీ సీఎం పవన్ సలహాలు పాటించాలని ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నిర్దేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నగోదావరి పుష్కరాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేసినట్లు సమాచారం.